కేసీఆర్ గారు తెలంగాణను గొప్పగా అభివృద్ధి చేశారు: ఎంపీ రవిచంద్ర
బీఆర్ఎస్ అభ్యర్థి నామకు ఘన విజయం చేకూర్చుదాం: ఎంపీ రవిచంద్ర
ఎంపీ రవిచంద్ర వైరా మీటింగుకు లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ మధు, మాజీ ఎమ్మెల్యేలు మదన్ లాల్, రాములు నాయక్, కోటేశ్వరరావులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు
తనను రాజ్యసభకు తిరిగి పంపిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు వద్దిరాజు రవిచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.రాజ్యసభకు ఇటీవల జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పక్షాన రవిచంద్రను పార్టీ అధినేత నిలపడం,ఆయన ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం తెలిసిందే.రవిచంద్ర చేత గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనఖర్ ప్రమాణం స్వీకారం చేయించారు.ఎంపీ రవిచంద్ర ఢిల్లీ నుంచి శుక్రవారం ఉదయం నేరుగా ఖమ్మం జిల్లాకు చేరుకుని పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.అలాగే ఎంపీ వద్దిరాజు వైరాలో ఏర్పాటు చేసిన పార్టీ మండల,పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశానికి లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు బానోతు మదన్ లాల్, రాములు నాయక్,కొండబాల కోటేశ్వరరావులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, పార్టీ ఓకే ఒక సీటు గెలుచుకునే అవకాశం,రాజ్యసభ అభ్యర్థిత్వం కోసం ఎంతోమంది ఆశావహులు ఉన్నా కూడా మహానేత కేసీఆర్ తన పేరునే ఖరారు చేయడం గొప్ప విషయమన్నారు.పార్టీ ఉన్నతి కోసం తాను చేస్తున్న కృషి, బీసీ బిడ్డను కావడం,బహుజనులకు అవకాశాలు పెంపొందించాలనే సదాశయంతో కేసీఆర్ తనను తిరిగి రాజ్యసభకు పంపడం జరిగిందని వివరించారు.తాను కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా, ఆదేశానుసారం పార్టీ కోసం అహర్నిశలు కృషి సల్పుతానని ఎంపీ వద్దిరాజు చెప్పారు.కేసీఆర్ తన పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేసి దేశం మొత్తం మీద ఆదర్శవంతంగా తీర్చిదిద్దారన్నారు.కరెంట్,సాగు, తాగునీళ్లు పుష్కలంగా అందుబాటులోకి తెచ్చారని, దేశంలోని రైతు సంఘాల నాయకులంతా తెలంగాణకు విచ్చేసి అధ్యయనం చేసిన సందర్భాలను ఎంపీ రవిచంద్ర గుర్తుచేశారు.ఈ లోకసభ ఎన్నికలలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలందరం కూడా మరింత సంఘటితమై బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావుకు ఘన విజయం చేకూర్చుదామని ఎంపీ రవిచంద్ర అన్నారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ ప్రముఖులు వెంకటేశ్వర్లు,కనకదుర్గ,పనమ విశ్వేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.సమావేశం ప్రారంభానికి ముందు నాయకులందరు మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రాం 115వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.