
సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా తునికాకు గుత్తేదారులతో టెండర్లు వేయించి , పృనింగ్ లింగ్ పనులు చేపట్టాలని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో గుండాల రేంజ్ ఆఫీసులో డిఆర్ఓ కు వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్ )న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల జడ్పిటిసి వాగబోయిన రామక్కలు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు, ఇతర పేదలు రెండవ పంటగా భావించే తుని కాకు టెండర్లు వేయింనిసి, పృనింగ్ పనులు చేపటలని డిమాండ్ చేశారు.
వన్య ప్రాణుల పరిరక్షణ పేరుతో ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వం కుమ్మక్కై తునికాకు టెండర్లను ఆపటం సరికాదని, వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని తుని కాకు గుత్తేదారులను టెండర్లకు పిలిచి, ప్రూనింగ్ చేపట్టాలని, యాభై ఆకుల కట్టకు ఐదు రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలోగుండాల మాజీ సర్పంచ్ కొమరం సీతారాములు,పార్టీ మండల కార్యదర్శి అరేం నరేష్, పర్శక రవి, యాసారపు వెంకన్న, గడ్డం లాలయ్య,బానోతు లాలు,వాగబోయిన బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.