తెలంగాణ రాష్ట్ర సామాజిక ఆర్థిక దృక్కోణం నివేదిక

తెలంగాణ ప్రభుత్వం ఏటా బడ్జెట్‌ సెషన్‌కు ముందు ‘సామాజిక ఆర్థిక దృక్కోణం’ పేరుతో ఒక నివేదికన శాసనసభ ముందుంచడం ఆనవాయితీ. ఆర్థిక రంగంలో వివిధ విభాగాల్లో రాష్ట్ర ప్రగతి ఏవిధంగా ఉన్నదనేది ఇందులో స్పష్టంగా వివరిస్తుంది. ఆర్థిక ప్రగతి, సామాజికాభివృద్ధి, అ త్యవసర సర్వీసులు, ఇతర కీలక సూచికలకు సంబంధించిన వివరాలను ఇందులో ప్రభుత్వం పొందుపరుస్తుంది. అంతేకాదు రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి సంబంధించి గణాంకాలతో వివరించడం వల్ల ప్రస్తుతం తెలంగాణ స్థితిగతులపై ఒక అవగాహన ఏర్పడుతుంది.

వ్యవసాయం, తయారీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఔషధరంగ పరిశ్రమలు వంటి వివిధ రంగాలో పురోగామి పథంలో పయనిస్తుండటంతో, తదనుగుణంగా రాష్ట్ర ప్రగతి కూడా అభివృద్ధి పథంలోముందుకు దూసుకుపోతున్నది. దేశ స్థూల జాతీయోత్పత్తితో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర జాతీయో త్పత్తి అధికం. పలితంగా దేశ ఆర్థిక ప్రగతిలో తెలంగాణ తనవంతు ముఖ్య పాత్రను పోషిస్తోం ది. దీంతో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. మరోవైపు మౌలిక సదుపాయాల కల్పన, పారి శ్రామిక విస్తరణ, రాష్ట్రాన్ని ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తున్నాయి.

విహంగవీక్షణం

తెలంగాణ భూదృశ్యం ఎంతో వైవిధ్యంతో కూడివుంది. తూర్పు దక్కన్‌ పీఠభూమి ప్రాంతంలో సారవంతమైన భూములనుంచి ఉత్తరాన పశ్చిమ కనుమల్లో పర్వతాలతో కూడిన అడవుల వరకు వైవిధ్య లక్షణాలతో తెలంగాణ నేల విస్తరించింది. జనాభా పరంగా దేశంలో 12వ స్థానంలో, విస్తీర్ణ పరంగా (1,12,007 చ.కి.మి) 11వ స్థానాన్ని ఆ క్రమిస్తోంది. గోదావరి, కృష్ణ రాష్ట్రంలో ప్రవహించే ప్రధాన నదులు. వీటికింద వరుసగా 79% మరియు 69% ఆయకట్టు ప్రాంతాలున్నాయి.

ఆర్థికం

రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో స్థితిస్థాపక లక్షణంతో ముందుకు దూసుకెళుతోంది. ఆర్థికపరం గా ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్రంలోని వివిధ రంగాలు ఆర్థిక గతిశీలతతో ముందుకు వెళు తుండటం విశేషం. పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన, సృజనశీలతను తగినవిధంగా ప్రో త్సహించడం వంటి ప్రభుత్వం చేపడుతున్న ప్రోయాక్టివ్‌ విధానాలవల్లనే అన్నిరంగాలు ప్రగతి పథంలో పయనించడానికి ప్రధాన కారణం. వైవిధ్యభరిత ఆర్థిక వేదిక మరియు సుస్థిర మౌలిక సదుపాయాల కల్పన వంటివి స్థిరమైన ప్రగతి సాధనకు ఉపకరించడమే కాకుండా, ప్రపంచంలో చోటుచేసుకుంటున్న అర్థిక ఒడిదుడుకులను తట్టుకొని ముందుకెళ్లడానికి ఉపకరిస్తున్నాయి.

స్థూల ఆర్థిక పోకడలు

సేవారంగం రాష్ట్ర స్థూల ఆర్థిక చేర్చిన విలువ (జీఎస్‌వీఏ) వృద్ధికి ప్రధాన దోహదకారిగా వుండ గా, పారిశ్రామక, వ్యవసాయం అనుబంధ పరిశ్రమలు తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. 2023`24 ఆర్థిక సంవత్సరానికి ముందస్తు అంచనాల ప్రకారం వర్తమాన ధరల్లో తెలంగాణ జిఎస్‌వీఏకు 65.7% మద్దతు సేవారంగం నుంచి లభించింది. మైనింగ్‌, క్వారీలతోపాలు పారిశ్రామిక రంగం మద్దతు 18.5% కాగా వ్యవసాయం మరియు అనుబంధ పరిశ్రమల వాటా 15.8%గా నమోదైంది.

తెలంగాణ తలసరి ఆదాయం 2014`15లో రూ.124014 నుంచి 2023`24లో రూ.347299కి పెరిగింది. అయితే ఇదేకాలంలో రాష్ట్ర అప్పులు రూ.72,658 కోట్ల నుంచి రూ.671757 కోట్లకు వృద్ధి చెందడం గమనార్హం. అంటే అప్పులు ఏకంగా 824.5% పెరిగాయి. అదేవిధంగాతలసరి అప్పు రూ. 20251 నుంచి రూ.1,76360కి చేరుకుంది. ఆదాయంతో పోలిస్తే అప్పులువిపరీతంగా పెరగడం ఆర్థిక సుస్థిరతను దెబ్బతీసే అవకాశాలే మెండు. ఈ నేపథ్యంలో ప్రభు త్వం ఖర్చులను తగ్గించుకొని, ఆదాయాన్ని పెంచుకోకపోతే అధికంగా అప్పులపై ఆధారపడాల్సి వస్తుంది. ఇది రాష్ట్ర ఆర్థిక సుస్థిరతకు క్షేమకరం కాదు.

పబ్లిక్‌ ఫైనన్స్‌ (సార్వజనిక ధనం)

ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం వివిధ రంగాలకు పెద్దమొత్తంలో నిధులు కేటాయించింది. వ్యవసాయరంగానికి, రైతులకు మద్దతుగా వ్యవసాయరంగంలో ఉత్పత్తిని పెంచేందుకు రూ.19746 కోట్లు కేటాయించింది. విద్య, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.21389కోట్లు, వైద్యం, ఆరోగ్య రంగానికి రూ.11,500 కోట్లు, నీటిపారుదల రంగానికి రూ.28,024కోట్లు, ట్రాన్స్‌కో మరియు డిస్కమ్‌లకోసం రూ.16,825కోట్లు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధికి రూ.40,080కోట్లు కేటాయించింది. పట్టణాల పాలన సజావుగా సాగేందుకు మున్సిపల్‌ పాలనావ్యవస్థకోసం రూ.11,692కోట్లు ప్రభుత్వం కేటాయించింది. షెడ్యూల్డు కులాల సంక్షేమానికి రూ.21,874కో ట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.13,313కోట్లు, బి.సి.ల సంక్షేమానికి రూ.8వేల కోట్లు, మైనారిటీలసంక్షేమానికి రూ.2262కోట్లు ప్రభుత్వం కేటాయించింది.

వ్యవసాయం అనుబంధ పరిశ్రమలు

రాష్ట్రంలో పట్టణీకరణ, పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ, వ్యవసాయరంగం తన కీలకపాత్రను కొనసాగిస్తూనే వుంద. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తులను మరింతగా పెంచేందుకు వీలుగా రైతులకోసం అనేక పథకాలను ప్రభుత్వం అమలు జరుపుతోంది. సమతు ల్య ఆర్థిక ప్రగతి, సామాజికాభివృద్ధి, పర్యావరణ సుస్థిరత అనే అంశాలపై ప్రభుత్వం ప్రధానం గా దృష్టి కేంద్రీకరించింది.
వర్తమానధరల్లో జీఎస్‌వీఏకు ఈ ఏడాది వ్యవసాయరంగం మద్దతు కేవలం 4% మాత్రమే. 2022ా23 తొలి సవరించిన అంచనాల ప్రకారం వ్యవసాయరంగం మద్దతు రూ.2,03,247కోట్లుకాగా 2023ా24 సంవత్సరానికి ముందస్తు అంచనాల్లో ఈ మొత్తం రూ.2,11,422 కోట్లకు పెరిగింది.

వ్యవసాయం

2021ా22 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన వ్యవసాయ గణాంకాల ప్రకారం 2015ా16లో తలసరి భూకమత విస్తీర్ణం 1హెక్టారు నుంచి 0.89హెక్టారుకు పడిపోయింది. ఈవిధంగా భూకమ తాల విస్తీర్ణం ఇంకా తగ్గుతూ పోతే, వ్యవసాయ ఉత్పత్తిపై దీని ప్రభావం తీవ్రంగా పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతుభరోసా కింద రైతుల పెట్టుబడికి మద్దతు కల్పిస్తూ వారికి అండ గా నిలుస్తోంది. ప్రధానంగా భూకమతాల విస్తీర్ణం మరింత తగ్గిపోకుండా చూడటం ఇందులోని ప్రధాన లక్ష్యం. రుణ మాఫీ ద్వారా రైతులపై రుణభారం తగ్గించడం ఇందులో భాగమే. ఇదే సమయంలో పంటబీమా అమలను మరింత సమర్థవంతం చేసేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

పండ్లతోటల పెంపకం

రైతుల ఆదాయాన్ని పెంచేక్రమంలో, వ్యవసాయరంగంలో వైవిధ్య పెట్టుబడులకు ప్రభుత్వం ప్రో త్సాహం కల్పిస్తోంది. ఇందులో భాగంగానే పామాయిల్‌ తోటల సాగు చేపట్టేందుకు రైతులను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా 2024`25 ఆర్థిక సంవత్సరంలో ‘ఎన్‌.ఎం.ఇ.ఒ`ఒ.పి.’ పథకం కింద లక్ష ఎకరాల మేర పామాయిల్‌ తోటల విస్తీర్ణాన్ని పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రూ.348.81కోట్లు కేటాయించింది. 2024`2028వరకు అమలుచేసే ఈ పథకం కింద పామాయిల్‌ సాగుచేసే రైతులకు అన్ని స్థాయిల్లో ప్రభుత్వం పూర్తి మద్దతు ఇ స్తుంది. ఈవిధంగా 2028 నాటికి పామాయిల్‌ తోటల విస్తీర్ణాన్ని 3.5లక్షల ఎకరాలకు విస్తరిం చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీని సాధనకు ఈ కాలంలో మొత్తం రూ.1279.53కోట్లు ఖర్చు చే స్తుంది.

పశుపోషణ మరియు మత్స్య పరిశ్రమ

తెలంగాణలో ప్రస్తుతం మొత్తం గొఱ్ఱెల జనాభా 190.63లక్షలు కాగా కోళ్లు 799.99లక్షలు. అదేవిధంగా గేదెల సంఖ్య 42.26లక్షలు, మేకలు 49.35లక్షలు, పశువులు 42.31లక్షలు, పం దుల సంఖ్య 1.78లక్షలు. 2022ా23 ఆర్థిక సంవత్సంలో తలసరి గుడ్ల అందుబాటు 392 కాగా తలసరి మాంసం 23.97కిలోగ్రాములు అందుబాటులో వుంది.

అడవులు మరియు పర్యావరణం

ప్రస్తుతం రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం మొత్తం రాష్ట్ర భూభాగంలో కేవలం 24% మాత్రమే వుంది.దీని విస్తీర్ణాన్ని 33%కు విస్తరింపజేసేందుకు ప్రభుత్వం ‘వనమహోత్సవం’ కార్యక్రమాన్ని అమలు జరుపుతోంది. ఈ కార్యక్రమాన్ని రెండు విధాలుగా అమలుచేస్తోంది. మొదటిది ఉన్న అడవుల విస్తీర్ణాన్ని పెంచడం, రెండవది అడవుల వెలుపల ఉన్న ప్రాంతాల్లో చెట్ల పెంపకం. ఇందులో భాగంగా 2024`25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,002లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వంలక్ష్యంగా పెట్టుకుంది. ఈ మొత్తంలో 1,009లక్షల నారు మొక్కలను మున్సిపల్‌ మరియు పట్టణఅభివృద్ధి శాఖకు, గ్రామీణాభివృద్ధి శాఖకు 637లక్షల నారు మొక్కలు, అటవీశాఖకు 134లక్షల నారు మొక్కలు కేటాయిస్తుంది.

సామాజిక మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి

రాష్ట్ర పౌరుల జీవన ప్రమాణాలు పెంచేందుకు, సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ మరియ మైనారిటీల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. పటిష్టమైన ఆరోగ్య, విద్యా సేవలను అందించడం ద్వారా, పట్టణ`గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న తేడాను తొలగించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

ఎస్సీ/ఎస్టీ వర్గాల సంక్షేమం

ఎస్సీ/ఎస్టీ వర్గాలకు సంక్షేమం పథకాలను అమలుచేసే ఉద్దేశంతో ప్రభుత్వం ‘షెడ్యూల్డు కులాలుషెడ్యూల్డు ట్రైబ్స్‌ ప్రత్యేక అభివృద్ధి నిధి పథకం`2017’ను అమల్లోకి తెచ్చింది. అన్ని రంగాల్లో ఈ వర్గాల అభివృద్ధికి ఈ పథకం దోహదం చేసింది. 2023`24 సంవత్సరానికి ఎస్సీ స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ కింద రూ.36750.48 కోట్లు కేటాయించింది. ప్రగతిపొద్దు పథకం కింద మొత్తం కేటాయింపులో ఇది 23.03%. ఈ మొత్తంలో రూ.14468.94కోట్లు షెడ్యూల్డు కులాలవారి అభివృద్ధికోసం ప్రభుత్వం ఖర్చు చేసింది.అదేవిధంగా ఎస్టీ స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ కింద రూ.15,232.62 కోట్లు కేటాయించగా ఇది ప్రగతిపొద్దు పథకంలో దీని వాటా 9.45%.ఈ మొత్తంలో రూ.10,398.96కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది.
కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్‌ పథకం కింద 18 సంవత్సరాలు దాటిన యువతులకు ప్రభుత్వం రూ.1,00,116 అందజేస్తోంది. ఎస్సీ/ఎస్టీ/బీసీ/మైనారిటీ వర్గాల ప్రజల్లో వివాహ ఖర్చుభారాన్ని తగ్గించడం ఈ పథకం అమలు ప్రధాన ఉద్దేశం. ఈ పథకాన్ని కులాంతర వివాహాలు మరియు ప్రేమ వివాహాలకు కూడా ప్రభుత్వం విస్తరించింది. 2023`24 ఆర్థిక సంవత్సరంలో ఈ పథ కం కింద మొత్తం రూ.236.67కోట్లు 23,636 మంది ఎస్సీలకు, రూ.177.38 కోట్లు 17,715మంది ఎస్టీలకు, బీసీ/ఈబీసీ వర్గాలకు చెందిన 83,067 మందికి రూ.831.64 కోట్లు, మైనారిటీ వర్గాలకు చెందిన 41,858 మందికి రూ.419.13కోట్లు ప్రభుత్వం చెల్లించింది.

విద్య మరియు నైపుణ్యాభివృద్ధి

రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను నెలకొల్పాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను దృష్టిలో వుంచుకొని ప్రభుత్వం ఈ దిశగా అడుగులు ముందుకేస్తున్నది. అదేవిధంగా గచ్చిబౌలిలో మొట్టమొదటి స్కిల్‌ యూనివర్సిటీ ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.

ఆరోగ్యం మరియు క్షేమం

రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సహాయానికి అందిస్తున్న రూ.5లక్షల మొత్తాన్ని రూ.10లక్షలకు పెంచింది. ఇదే సమయంలో ఈ పథకంలో అదనంగా 1672 మెడికల్‌ ప్రొజీజర్స్‌ను, 32 ప్రత్యేక సేవలను చేర్చింది. ప్రస్తుతం 364 ప్రైవేటు ఆసుపత్రులతో సహా 1406 ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలందిస్తున్నాయి.

మహిళా శిశు సంక్షేమం

ప్రస్తుతం అంగన్‌వాడి ప్రాజెక్టుగా వ్యవహరిస్తున్న సమీకృత శిశు అభివృద్ధి సేవలు (ఐసీడీఎస్‌) ప్రస్తుతం 33 జిల్లాల్లో 149 ప్రాజెక్టుల్లో అమలవుతోంది. వీటిల్లో 99 గ్రామీణ ప్రాంతాల్లో, 25 పట్టణ ప్రాంతాలు మరో 25 గిరిజన ప్రాంతాల్లో అమలవుతున్నాయి. ఈ ప్రాజెక్టుల కింద రాష్ట్రంలో 35,700 అంగన్‌వాడి కేంద్రాలు విస్తరించి వున్నాయి. వీటిల్లో పిల్లలకు పూర్వ పాఠశాల బోధన, పోషకాహారం సరఫరా వంటి సదుపాయాలు అందుబాటులో వున్నాయి.
పంచాయతీరాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ
వృద్ధులు, ఒంటరి మహిళలు, అనాధలు, వితంతువులు, హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ వ్యాధి పీడితులకోసంప్రభుత్వం ఆసరా పింఛన్ల పథకాన్ని అమలు చేస్తోంది. బోదకాలు, కల్లుగీత కార్మికులు, నిరుపేదబీడీ కార్మికులు, డయాలసిస్‌ చికిత్స తీసుకునేవారికి కూడా ఈ పింఛను పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.

మున్సిపల్‌ పాలన పట్టణాభివృద్ధి

హైదరాబాద్‌ నగరం మూసీనది ఒడ్డున ఉన్నది. ఈ నది నీరు కృత్రిమంగా నిర్మించిన ఉస్మాన్‌సాగర్‌, హిమయత్‌సాగర్‌ సరస్సుల్లోకి చేరుతుంది. మూసీ పరీవాహక ప్రాంతం విస్తరించిన 55 కిలోమీటర్ల మేర పార్కులు, చిన్నపిల్లల వాటర్‌ స్పోర్ట్స్‌, వీధివ్యాపారుల జోన్లు, ఎమ్యూజ్‌మెంట్‌ పార్కులు, షాపింగ్‌ మాల్స్‌తో సుందరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. చార్మినార్‌, కుతుబ్‌షాహీ సమాధులను కలిపే వారసత్వ పర్యాటకాన్ని మరింత విస్తరించేందుకు ఈ పథకం వల్ల వీలవుతుంది. ఇదే సమయంలో ప్రభుత్వం మూసీ ప్రక్షాళన కార్యక్రమం కోసం 2024`25ఆర్థిక సంవత్సరానికి వెయ్యికోట్లు ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కింద కేటాయించింది.

ఆర్థిక మౌలిక సదుపాయాలు

పారిశ్రామిక, సేవారంగాలు ఉపాధి కల్పనలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, వస్త్రపరిశ్రమ, తయారీరంగం పెద్దమొత్తంలో ఉపాధి అవకాశాలు కల్పించడమే కాదు రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధికి దోహదం చేస్తుంది. ఇదే సమయంలో ఐటీసేవలు, హెల్త్‌కేర్‌, విద్య, హాస్పిటాలిటీ వంటి సేవారంగాలు జీవన నాణ్యతను మెరుగుపరచడంలో ఎంతో ఉపకరిస్తా యి. ప్రధానంగా పెట్టుబడులకు ఆకర్షణగా నిలవడంతో ఆర్థికాభివృద్ధిలో ఈరంగం కీలకపాత్ర పోషిస్తున్నది. 2023`24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జిఎస్‌డీపీలో సేవారంగం వాటా వర్తమానధరల్లో ఏకంగా 65.7% నమోదు కావడంతో, అభివృద్ధిలో ఈ రంగం ప్రాధాన్యత మరోసారి వెల్లడైంది. భారత సగటు జి.డి.పి. 54.9%కంటే ఇది అధికం కావడంతో ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ కీలకపాత్ర పోషించే స్థాయికి ఎదిగింది.

ఇంధనరంగం

రాష్ట్ర జి.ఎస్‌.డి.పి.లో ఇంధనరంగ వాటా వర్తమాన ధరల్లో రూ.2291కోట్లకు పెరిగింది. 2022ా23 ఆర్థిక సంవత్సరంలో జిఎస్‌డీపీలో ఇంధనరంగ వాటా తొలి సవరించిన అంచనాల ప్రకారం రూ.22229కోట్లు. ఈ మొత్తం ప్రస్తుతం 2023ా24 ఆర్థిక సంవత్సరంలో ముందస్తు అంచనాల ప్రకారం రూ.24520కోట్లకు పెరిగింది.

రవాణా

రాష్ట్రంలో హరితవిప్లవం తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 2023 సెప్టెంబర్‌ నుంచి 25 ఇామెట్రో ఎ/సి బస్సు సేవలను ప్రారంభించింది. ముఖ్యంగా నగరంలోని పశ్చిమ సెక్టార్‌నుంచి దూర ప్రాంత ప్రయాణికులకోసం ఈ బస్సులను నడుపుతున్నారు. 2024, మార్చి 12న ముఖ్య మంత్రి రేవంత్‌ రెడ్డి నగరంలో 25 ఇామెట్రో బస్సులను ప్రారంభించారు. వీటికి తోడు టి.జి.ఎస్‌.ఆర్‌.టి.సి. 500 సిటీ ఇాబస్సులు, 550 ఇంటర్‌ సిటీ ఇాబస్సులను ‘గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌’ విధానంలో ప్రవేశపెట్టడానికి ఒప్పందం కుదుర్చుకుంది.
పరిశ్రమలు మరియు సేవలు
భారత్‌లోని పారిశ్రామిక రాష్ట్రాలతో పోటీపడే రీతిలో రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దేం దుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. ముఖ్యంగా పారిశ్రామికాభివృద్ధి ఉద్యోగ, ఉపాధి కల్పనలో కీలకపాత్ర పోషిస్తుందన్న సంగతి తెలిసిందే. ఎం.ఎస్‌.ఎం.ఇ.లు, ఔషధ, ఆహారశుద్ధి, మైనింగ్‌ పరిశ్ర మల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.
పరిశ్రమలు
2023ా24 ముందస్తు అంచనాల ప్రకారం జీఎస్‌వీఈలో పారిశ్రామిక రంగం వాటా 18.5% గా వుంది. వర్తమాన ధరల్లో ప్రస్తుతం జీఎస్‌వీఈలో ఈరంగం వాటా 10.1%గా వుంది. 2022ా23లో 225663కోట్లు వున్న ఈ రంగం ఆదాయం, 2023ా24లో ముందస్తు అంచనాల ప్రకారం 248505కు పెరిగింది. 2023ా24 ఆర్థిక సంవత్సరంలో మైనింగ్‌, క్వారీ పరిశ్రమలు 10.5% వృద్ధి నమోదు చేయగా, తయారీ రంగం 9.6% వృద్ధి నమోదు చేసింది. అదేవిధంగా విద్యుత్‌, గ్యాస్‌, నీటి సరఫరా, ఇతర వినియోగ ఉపరంగాలు 10.3% వృద్ధి నమోదు చేశాయి. ఇక నిర్మాణరంగం 10.9% వృద్ధి నమోదు చేసింది.

సేవలు

వర్తమాన ధరల్లో వర్తకం, మరమ్మతులు, హాస్పిటాలిటీ రంగాలు 20.81% వృద్ధి నమోదు చేశాయి. 2022ా23లో తొలి సవరించిన అంచనాల ప్రకారం రూ. 2,11,271కోట్ల నుంచి 2023ా24లో ముందస్తు అంచనాల ప్రకారం రూ.255771కి పెరిగింది. అదేవిధంగా వర్తకం, మర మ్మతుల రంగం 21.2% వృద్ధిని నమోదు చేసింది. 2022ా23 తొలి సవరించిన అంచనాల ప్రకారం రూ.200171 కోట్లనుంచి 2023ా24 ముందస్తు అంచనాల ప్రకారం రూ.242526 కోట్లకు వృద్ధి నమోదు చేసింది. ఇక హాస్పిటాలిటీ రంగం 14.8% వృద్ధి నమోదు చేసింది. 2022ా23లో తొలి సవరించిన అంచనాల ప్రకారం రూ.11544 కోట్ల నుంచి 2023ా24 ముందస్తు అంచనాల ప్రకారం రూ.13,246కోట్లకు పెరిగింది.
రవాణా, స్టోరేజీ, బ్రాడ్‌కాస్టింగ్‌, కమ్యూనికేషన్‌ రంగాలు 15% వృద్ధి కనబరచాయి. 2022`23లో తొలి సవరించిన అంచనాల ప్రకారం రూ.89081కోట్ల నుంచి 2023`24లో ముందస్తు అంచనాల ప్రకారం రూ.102453కోట్లకు వృద్ధిని నమోదు చేశాయి. ఇక రావాణా ఉపరంగం వృద్ధి 16.80% నమోదు చేసింది. 2022`23 సవరించిన సవరించిన తొలి అంచనాల ప్రకా రం రూ.73651 కోట్లు కాగా, 2023`24 తొలి ముందస్తు అంచనాల ప్రకారం రూ.86,031కి పెరిగింది. వీటిల్లో రైల్వే, రోడ్డు మరియు విమానయాన రంగాలున్నాయి.

పరిపాలన

మంచి నిర్ణయ సామర్థ్యంతో చేసే పాలననే ఉత్తమ పాలన అంటారు. సర్వజన శ్రేయస్సుకోసం చేసే పాలన ప్రజలకు మేలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రేవంత్‌ ప్రభుత్వం ‘ప్రజాపాలన’ పేరు తో పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచాలన్న ఉద్దేశంతో ముందుకెళుతోంది. ఇం దులో వృద్ధులకు పింఛన్లు, పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిర మ్మ ఇళ్లు, చేయూత పింఛన్లు ఈ పరిధిలోకి వస్తాయి. ప్రజాపాలన కింద ప్రభుత్వం అమలు జ రిపే ఆరు హామీలకు సంబంధించిన ప్రయోజనాలను నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకే జమచేస్తా రు. ఈ నేపథ్యంలో ప్రజాపాలన సేవాకేంద్రాలను (పీపీఎస్‌కే) ప్రతి ఎం.పి.డి.ఒ, మున్సిపల్‌ మరియు జిహెచ్‌ఎంసి సర్కిల్‌ ఆఫీసుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 956 పీపీఎస్‌కే కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిల్లో 556 గ్రామీణ ప్రాంతాల్లో 400 పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి.
తెలంగాణ ప్రజల సాధికారత, ప్రభుత్వ జవాబుదారీతనానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రజావాణి’కీలకమైన ఉపకరణంగా పనిచేస్తుంది. దీనికింద సంక్షేమ పథకాలు అందడంలో ఆలస్యం, సేవలు సంతృప్తికరంగా లేకపోవడం, అవినీతి, నిర్లక్ష్యం వంటి సమస్యల పరిష్కారాన్ని ఈ ప్రజావాణికింద ప్రభుత్వం చూపుతుంది. ప్రజలు తమ ఫిర్యాదులను నిర్దేశిత కౌంటర్లలో అందజేయాల్సి వుంటుంది.
డిజిటల్‌ టెక్నాలజీని, ఈ`గవర్నెన్స్‌ను వేగంగా అమలు పరచడంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో వుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అందించినసమాచారం ప్రకారం ప్రతి వెయ్యి ఈ`లావాదేవీల్లో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో వుంది. పింఛనుదార్ల ముఖాన్ని గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం రియల్‌ టైమ్‌ డిజిటల్‌ అ థెంటిఫికేషన్‌ ఆఫ్‌ ఐడెంటిటీ (ఆర్‌టీడీఏఐ)ను అమలు చేస్తోంది. తెలంగాణ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ (డీటీఏ) వద్ద ఉన్న డేటాబేస్‌లో 2.65లక్షల పింఛనుదార్ల పేర్లు నమోదయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *