జనగామ 13 మండలాల నుండి పెద్ద ఎత్తున తరలిన పద్మశాలీలు.
రఘునాధ పల్లి ( జనగామ) నేటి ధాత్రి :-
తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నామినేషన్ సందర్భంగా సోమవారం జనగామ జిల్లా వ్యాప్తంగా పద్మశాలి కులస్తులు తరలి వెళ్లారు.జనగామ జిల్లాలోని 13 మండలాల అధ్యక్ష కార్యదర్శులతో పాటు పద్మశాలి కులస్తులు వివిధ వాహనాల్లో హైదరాబాద్కు తరలి వెళ్లారు. నామినేషన్ సందర్భంగా సందడే సందడి నెలకొంది జై పద్మశాలి జై జై పద్మశాలి అంటూ పద్మశాలి కులస్తులు నినాదాలు తో భారీ వ్యాలీగా నామినేషన్ కు తరలి వెళ్లారు.
ఈ కార్యక్రమంలో జనగామ పో ప పట్టణ అధ్యక్షులు దోర్నాల వెంకటేశ్వర్లు నేత, కాముని శ్రీనివాస్ నేత,రఘునాథపల్లి మండల అధ్యక్షులు కరీంకోండ వెంకటేశ్వర్ నేత, గజ్జల దామోదర్ నేత, చింతకిందికృష్ణమూర్తి,దోర్నాల కుమారు,కుమార్, లక్ష్మీనారాయణ, మంగళపల్లి జనార్ధన్,బత్తిని శ్రీను,వంగ యుగంధర్, భువన రమేష్,కోడం శ్రీనివాస్,కాముని సమ్మయ్య,బొంతపల్లి నాగరాజు, బత్తిని కిషోర్, కుందారపు లక్ష్మందాస్,ఏనగందుల కృష్ణ,మాదాస్ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు