పోలీసు అధికారులు శాఖపరమైన తప్పులు చేస్తే పరిష్మెంట్ తప్పనిసరి..
జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్..
మహబూబ్ నగర్ జిల్లా పోలీసు కవాతు మైదానం లో సోమవారం రోజు జిల్లాలోని బ్లుకోట్ మరియు పెట్రో కార్ల తనిఖీ జిల్లా ఎస్పీ నిర్వహించరు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ,ప్రతిరోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ ఎన్ని బిట్స్ నడుస్తున్నాయని తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24×7 గస్తీ నిర్వహించాలని సూచించారు. ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. సిబ్బంది, అధికారులు అందరూ సక్రమంగా విధులు నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు. ప్రస్తుత రోజుల్లో మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నయని ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ మరియు టౌన్ సిబ్బంది అందరూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై పై ఎక్కువ దృష్టి సారించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని అన్నారు.
అలాగే పోలీసు సిబ్బందికి అందరూ ద్విచక్ర వాహనాలు నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు, సిబ్బంది ఎవరైనా మంచిపని చేస్తే మంచి రివార్డ్ ఇస్తానని, ఒకవేళ తప్పుడు పనులు చేస్తే శాఖా పరమైన పరిష్మెంట్ ఇస్తానని అన్నారు. సిబ్బందికి సంబంధించి శాఖా పరమైన ఎలాంటి పనులైన తక్షణమే పరిష్కరిఇస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు, ఎం టీ ఓ /ఆర్ ఐ నగేష్, ఐటీ కోర్ సిబ్బంది మరియు పీ ఆర్ ఓ, ఏంటీ సిబ్బంది పాల్గొన్నారు.