గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో
కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో గురువారం సాయంత్రం తెలంగాణ రీజినల్ కమాండెంట్ ఇసుకపల్లి రామశేషమూర్తి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నరేష్ వారిని సాదరంగా ఆహ్వానించి అర్చన అభిషేకం నిర్వహించిన అనంతరం శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.