తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
హసన్‌పర్తి మండలంలోని వివిధ గ్రామాలలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వార్డుసభ్యులు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన అమరవీరులకు నివాళులు అర్పించారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారుతెలంగాణగా అభివృద్ధి పథంలో ముందుకు నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపిటిసి, వార్డుసభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.