
Telangana Politics: Local Battle Heats Up
స్థానిక సమరం.. ఎవరికి అనుకూలం!
శాయంపేట నేటిధాత్రి:
తెలంగాణలో 10 ఏళ్ల టిఆర్ఎస్ పాలన తర్వాత గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కొలువు దీరి 20 నెలల పాటు పాలన పూర్తయింది. ఇక ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎలాంటి అంచనాలు ఉన్నా యని చర్చ ఆసక్తికరంగా నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు. పదేండ్ల టిఆర్ ఎస్ పాలనలో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొని పార్టీ అభ్యర్థుల గెలుపు కోసంపాటు పడితే గెలిచిన అనంతరం తమను పట్టించుకోకుండా పార్టీ ఫిరాయింపుదార్లకే పెద్ద పీటా చేస్తున్నారని చాలా రకాలుగా పార్టీల క్యాడర్ మండిపడుతోంది.కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడిన క్యాడర్ ని కాదని గత బిఆర్ ఎస్ ఎమ్మెల్యేల వద్ద అనేక పైరవీలు ఎమ్మెల్యేని భ్రష్టుప ట్టిన వ్యక్తులు మళ్లీ తాజా ఎమ్మెల్యే వద్ద చేరినారని ఆరోపణలు వినిపిస్తున్నాయి పార్టీ జెండా మోసిన అసలు సిసలు కార్యకర్తలను పట్టించు కోకపోవడం లేదని తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవి ప్రమాణం చేసిన నాటి నుండి నేటి వరకు అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు మరికొన్ని ప్రజలకు మేలు చేసేదిగా ఉన్నాయి. ప్రభుత్వం కొలువుదీరిన సమయం చాలా తక్కువగా ఉంది. అనేక సంక్షేమ పథకాల అమలుకు ప్రయత్నిస్తున్న మాట నిజమే అయితే అటు కేంద్రంలో కాం గ్రెస్ పార్టీకి పూర్తి వ్యతిరేకమైన బిజెపి అధికారంలో ఉంది. పదేళ్ల రాష్ట్రంలో పాలన సాగించిన కేసీఆర్ అనేక సంక్షేమ పథకాల అమలుకు కట్టడాల పేరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించింది. ఆరు గ్యారెంటీలు అమలు ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో పూర్తి మెజార్టీ కాంగ్రెస్ పార్టీ ముందున్న లక్ష్యం కాబట్టి ప్రజల తీర్పు ఎటువైపు ఉంటుందో! ఆలోచించాల్సి ఉంది.