
ప్రిన్సిపల్ ఎన్ మహేందర్
జగిత్యాల నేటి ధాత్రి జగిత్యాల జిల్లా కేంద్రంలో గల తెలంగాణ మైనారిటీ జూనియర్ కళాశాల(బాలురు) యందు 2024 -2025 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ప్రథమ సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్నట్టు కళాశాల ప్రిన్సిపల్
ఎన్. మహేందర్ తెలిపారు జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరమునందు ఎంపీసీ మరియు బైపీసీ గ్రూపుల యందు మొత్తముగాను 80 సీట్లు కలవని, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో గాని లేదా కళాశాల యందు నేరుగా కూడా సంప్రదించి, అడ్మిషన్ చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా మైనారిటీ, మరియు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని తెలియజేశారు. అడ్మిషన్లు చేసుకోవడానికి చివరి తేదీ తెలిపారు.