– రాజన్న సిరిసిల్ల జిల్లాను సైతం ముందు వరుసలో నిలబెట్టాలి
– మహిళా కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ ఇంచార్జ్ కృష్ణవేణి
సిరిసిల్ల(నేటి ధాత్రి):
సభ్యత్వ నమోదులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో నిలిచిందని, అదే స్ఫూర్తితో రాజన్న సిరిసిల్ల జిల్లాను రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలపాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ ఇంచార్జీ కృష్ణవేణి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జిల్లా మహిళా కాంగ్రెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా విభాగం సభ్యత్వ నమోదు సమావేశం నిర్వహించారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత నలినీకాంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ఆల్క లంబా, రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతా రావు ఆదేశాల మేరకు బుధవారం సమావేశం నిర్వహించగా, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కృష్ణవేణి హాజరయ్యారన్నారు. గత సెప్టెంబర్ 15 నుండి మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నుండి సభ్యత్వం నమోదు ప్రక్రియ ప్రారంభం అయిందన్నారు. సభ్యత్వం నమోదు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. మహిళ కాంగ్రెస్ లో జిల్లా విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న వారందరు సభ్యత్వ నమోదు చేయించాలని కోరారు. అనంతరం ఇంచార్జి కృష్ణవేణి మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు రావడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చెయ్యడానికి సెప్టెంబర్ 15 న మొదలైన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి మహిళా నాయకురాలు విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. సభ్యత్వం నమోదు ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, రాజన్న సిరిసిల్ల జిల్లాను సైతం రాష్ట్రం లో ముందు నిలిపేలా ప్రతి ఒక్కరు తమ వంతు తోడ్పాటును అందించాలన్నారు. ఇప్పటివరకు సభ్యత్వం నమోదు చేయని మహిళా కాంగ్రెస్ సభ్యులు సభ్యత్వ నమోదు ప్రక్రియను మొదలు పెట్టాలని సూచించారు. రానున్న రోజుల్లో వచ్చే ఎన్నికలలో అవకాశం వస్తే ప్రతి మహిళా పోరాడాలని, విజయం సాధించాలని సూచించారు. మహిళా కాంగ్రెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత నలినీకాంత్ కి సహకరిస్తు, సభ్యత్వ నమోదును పెంచాలని సూచించారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి గడప గడపకు తీసుకెళ్లి అర్థం అయ్యేలా వివరించాలని కోరారు. ఈ సమావేశంలో
ఏఎంసి చైర్మన్,సిరిసిల్ల టౌన్ అధ్యక్షురాలు వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి, జిల్లా జనరల్ సెక్రెటరీ కోడం అరుణ, సీనియర్ నాయకురాలు మడుపు శ్రీదేవి, గట్టు రుక్మిణి, సత్య లక్ష్మి, మండలాల అధ్యక్షురాలు హారిక , లహరి,లత, సత్య ప్రసన్న, రాజ్యలక్ష్మి, లహరి, సుధా, రోజా, సరిత, లత,మరియు జిల్లా కమిటీ మెంబర్స్, టౌన్ కమిటీ మెంబర్స్, వార్డ్ అధ్యక్షురాలు గ్రామ శాఖ అధ్యక్షురాలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది.