కూకట్పల్లి, జూలై 06 నేటి ధాత్రి ఇన్చార్జి
తెలంగాణ ప్రభుత్వ సలహా దారుగా కె. కేశవరావు
ఈరోజు నియమితుల య్యారు.
కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా
ఆయన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో
జారీ చేసింది.ఇటీవల కేకే బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్
లో చేరారు. అనంతరం ఆయన తన రాజ్యసభ సభ్య
త్వానికి కూడా రాజీనామా చేశారు.ఈ నేపథ్యంలో
కెకె ను సలహాదారుగా రేవంత్ ప్రభుత్వం నియ
మించింది.