
Telangana Formation Day Celebration
సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుక
జిల్లా కలెక్టర్ సందీప్ ఝా జెండా ఆవిష్కరణ
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలో పాల్గొని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జెండా ఆవిష్కరించడం జరిగినది.
తదనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.
అంతేకాకుండా జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నామని, ప్రభుత్వం నుండి గాని ప్రభుత్వ అధికారుల నుండి గాని జిల్లా ప్రజలకు అభివృద్ధిలో భాగంగా ముందుంటామని తెలపడం జరిగినది. తెలంగాణ అవతరణ దినోత్సవం లో భాగంగా జిల్లా కలెక్టర్ విద్యార్థిని, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేయడం జరిగినది.