తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు కెసిఆర్..
మండల బి ఆర్ ఎస్ అధ్యక్షుడు కిషన్ రెడ్డి..
ముత్తారం :- నేటి ధాత్రి
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మండలంలో మచ్చుపేట గ్రామ బస్టాండ్ సమీపంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల బి.ఆర్ఎస్ అధ్యక్షులు కిషన్ రెడ్డి పలువురు నాయకులు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృధ్ది చేసి అగ్రస్థానంలో నిలిపిన గొప్ప నాయకులు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ప్రాణాలను ప్రాణంగా పెట్టి తెలంగాణ సాధించిన మహా వ్యక్తి కేసీఆర్ అని అన్నారు, రాబోయే రోజుల్లో తెలంగాణ పాలన కొరకు ప్రజలు ఎదురుచూస్తున్నారని వారు తెలిపారు. అలాంటి మహా నాయకునితో కలిసి పనిచేయడం మాకు గర్వంగా ఉందని అన్నారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. మండల ప్రజల తరఫున కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జక్కుల ముత్తయ్య, వైస్ ఎంపీపీ సుధాటి రవీందర్రావు, మాజీ పీ ఎస్ సి చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ నూనె కుమార్, మాజీ ఎంపీపీ అత్తే చంద్రమౌళి, షేర్ స్వామి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.