రాజకీయ వివాదాలు, అవినీతిపై విచారణలతో హోరెత్తిన తెలంగాణ 2024 రివ్యూ

`కేసీఆర్‌ దిగ్గజాన్ని ఓడిరచి అధికారాన్ని కైవసం చేసుకున్న రేవంత్‌

`హామీల అమలులో కొత్త ప్రభుత్వం తలమునకలు

`గత ప్రభుత్వ అవినీతిపై విచారణలు వేగవంతం

`‘తగ్గేదే లేదు’ అంటూ దూసుకెళుతున్న రేవంత్‌

`వివాదాలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి

`కాంగ్రెస్‌కు ఎదురులేదు…బీఆర్‌ఎస్‌ ఇక లేవలేదు

`కాంగ్రెస్‌, బీజేపీలు ఢీ అంటే ఢీ

`ఊపేసిన హైడ్రా

`కుదిపేసిన సంధ్య థియేటర్‌ సంఘటన

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణల దగ్గరినుంచి, సినీ నటుడు నాగార్జున ఎన్‌ాకన్వెన్షన్‌ కూల్చివేత, నాగచైతన్యాసమంత విడాకులపై తెలంగాణ మంత్రి ఆరోపణలు, సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి, ఆమె తనయుడు కోమాలోకి వెళ్లడం, అల్లు అర్జున్‌ అరెస్ట్‌ వంటి వివాదాలు ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేశాయి. ఎన్నికల్లో చేసిన ఆరు వాగ్దానాల అమలును పూర్తిచేయాలంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై భారత రాష్ట్రసమితి తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొని రావడం, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత బీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి రావడానికి ఇప్పటినుంచే వ్యూహాలు అమలుచేయడం, ఇదే సమయంలో పదిమంది బీఆర్‌ఎస్‌ ఎమ్యెల్యేలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవడం ఆసక్తి కలిగించిన రాజకీయ పరిణామాలు. లిక్కర్‌ కేసులో కల్వకుంట్ల కవిత అరెస్ట్‌, బీఆర్‌ఎస్‌ హయాంలో పోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఒక రిటైర్డ్‌ పోలీసు అధికారితో సహా సర్వీసులో వున్న ముగ్గురు పోలీసు అధికార్ల అరెస్ట్‌ గత ప్రభుత్వ హయాంలో అవినీతి ఆరోపణలపై విచారణ వంటి సంఘటనలు కూడా ఈ ఏడా దిపతాక శీర్షికలెక్కాయి.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే బీఆర్‌ఎస్‌, బీజేపీలు, ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలు అమలు పరచాలంటూ కాంగ్రెస్‌పై ఒత్తిడి తీసుకురావడం, లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున వెంటనే వాటి అమలు సాధ్యం కావడంలేదని కాంగ్రెస్‌ చెప్పడం జరుగుతూ వచ్చింది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు చెరి 8స్థానాల్లో గెలుపొంది ఢీ అంటే ఢీ అనే స్థాయి లోవుండగా, ఎంఐఎం హైదరాబాద్‌ స్థానాన్ని నిలబెట్టుంది. 2019తో పోలిస్తే కమలం పార్టీ తనస్థానాలను రెట్టింపు చేసుకొని ఔరా అనిపించింది. అంతేకాదు మరో ఆరు సీట్లలో రెండో స్థానా న్ని ఆక్రమించి అధికార కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు సవాలు విసిరింది. 2019లో కేవలం 19.05శాతం ఓట్లతో నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్‌, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 35.08 శాతం ఓట్లతో ఎనిమిది స్థానాల్లో గెలుపు సాధించి ప్రత్యర్థి పక్షాలను ఖంగు తినిపించింది. అతే 2003 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయం పార్టీ సా ధించిన ఓట్లు కేవలం 13.90 శాతం మాత్రమే. ఈ ఓట్లతో 119 స్థానాలున్న అసెంబ్లీలో 8 సీట్లకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం.

లోక్‌సభ ఎన్నికలకు వస్తే 10`12 సీట్ల వరకు గెలవడం తథ్యమన్న విశ్వాసంతో కాంగ్రెస్‌ వుం డిరది. విచిత్రమేమంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌ స్థానంతో పాటు, ఆయన గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్‌గిరి స్థానాన్ని కూడా కాంగ్రెస్‌ చేజా ర్చుకోవడం పార్టీ నాయకత్వాన్ని ఆశ్చర్యానికి గురిచేసిందనే చెప్పాలి. 2019లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 30.9% ఓట్లతో మూడు స్థానాల్లో విజయం సాధించగా 2024లో తన ఓట్ల షేర్‌ను 40.10 శాతానికి పెంచుకొని 8స్థానాల్లో గెలుపు సాధించింది. అదే 2023 నవంబర్‌లో జరిగినఅసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 సీట్లకు గాను 64 స్థానాల్లో గెలిచి అధికారాన్ని చేపట్టింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సాధించిన ఓట్లు 39.40%. అంటే లోక్‌ సభ ఎన్నికలకు సుమారు రెండు శాతం ఓట్లను పెంచుకోగలిగింది.

2001లో తెలంగాణ రాష్ట్రసమితి ఏర్పాటైన నాటినుంచి పరిశీలిస్తే, 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (ఒకప్పటి టీఆర్‌ఎస్‌) దారుణంగా ఓటమి పాలైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 9స్థానాల్లో గెలుపొందిన బీఆర్‌ఎస్‌, 2024లో ఒక్క స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. నిజంగా పార్టీ ఆవిర్భావం నుంచి పరిశీలిస్తే ఇది గొప్ప పరాభవమని చె ప్పాలి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ పార్టీ 37.35% ఓట్లతో 39 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. గత ఎన్నికలతో పోలిస్తే పార్టీ ఓట్లు 16.68% పడిపోవడం గమనార్హం. పదేళ్లు అప్రతిహతంగా రాష్ట్రాన్ని పాలించిన పార్టీ పది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోవడంతోపాటు పాటు కీలక నాయకులు కూడా పార్టీని వీడటంతో తీవ్రస్థాయిలో నష్టపోయింది.

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే జి. లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం విపక్షపార్టీకి ఈ ఏ డాది తగిలిగిన తొలి దెబ్బ. ఈ ఏడాది మే నెలలో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఖాళీ అయిన ఈ అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరిగింది. కానీ ఈ స్థానాన్ని కాంగ్రెస్‌ గెలుచుకోవడంతో ఎమ్మెల్యే మరణం వల్ల వస్తుందనుకున్న సానుభూతీ పనిచేయలేదు. ఇక బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎన్నికల్లో పరాజయం తర్వాత మొగం చాటేశారు. ఒకటి రెండు సార్లు అసెంబ్లీకి వచ్చారంతే. ఇక లోక్‌సభ ఎన్నికల ప్రచారం తర్వాత ఆయన మళ్లీ జనాల్లోకి రాలేదు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సీనియర్‌ నాయకుడు హరీష్‌రావులు పార్టీని భుజాన మోస్తున్నారు.

ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ విషయంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, కె.సి.ఆర్‌. తనయ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్ట్‌ చేయడం సంచలనం సృష్టించడమే కాదు, బీఆర్‌ఎస్‌ అధినే తకు తీరని మనస్తాపానికి కారణమైంది. ఆమె జ్యుడిషియల్‌ కస్టడీలో వుండగా, సీబీఐ కవిత అరెస్ట్‌కు కోర్టు అనుమతి తీసుకుంది. ఆవిధంగా ఐదునెలల పాటు తీహార్‌ జైల్లో గడిపిన కవిత ఎట్ట కేలకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.

ఇక ఈ ఏడాది చివర్లో యాంటీ కరప్షన్‌ బూరో (ఏసీబీ), ఫార్ములా రేస్‌ కేసు విషయంలో కల్వ కుంట్ల తారకరామారావుపై కేసు నమోదు చేయడం కె.సి.ఆర్‌. కుటుంబానికి మరో షాక్‌. గవర్నర్‌ విష్ణుదేవ్‌ వర్మ అనుమతించిన నేపథ్యంలో, అవినీతి నిరోధక చట్టం కింద కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. యు.కె.కు చెందిన ఫార్ములా ఈ`ఆపరేషన్స్‌ లిమిటెడ్‌కు రూ.54.88 కోట్లు నిబంధనలను అతిక్రమించి చెల్లింపులు జరిపారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదైంది. తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ కేటీఆర్‌, రాష్ట్రాన్ని విద్యుత్‌ వాహనాల హబ్‌గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే ఫార్ములా ఈ`రేస్‌ను నిర్వహించాలని తలపోశామని వాదిస్తున్నారు. ఏసీబీ కేసు నమోదు చేసిన వెంటనే ఈడీ రంగంలోకి దిగి మనీ ల్యాడరింగ్‌కు సంబంధించి ఎన్‌పోర్స్‌మెట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఈసీఐఆర్‌)ను నమోదు చేసింది. కవిత, కె.టి.ఆర్‌ల పని ముగించిన తర్వాత ఇప్పుడు మరో సీనియర్‌ నాయకుడు కె. హరీష్‌రావుపై రాష్ట్ర ప్రభు త్వం దృష్టి పెట్టింది.

కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణలపై ప్రస్తుతం జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ విచారణ జరుపుతోంది. ప్రస్తుతం ఈ నివేదిక రూపకల్పన తుది దశలో వుంది. అధికారంలోకి వచ్చిన రెండు వారాలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు, భద్రాద్రి మరియు యాదగిరి థర్మల్‌ ప్రాజెక్టులపై వచ్చిన అవినీతి ఆరోపణల నిగ్గు తేల్చేందుకు జ్యుడిషియల్‌ విచారణకు ఆదేశించారు. అంతే కాకుండా ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నుంచి విద్యుత్‌ కొనుగోళ్ల విషయంపై కూడా రేవంత్‌ విచారణకు అనుమతించారు. రెండు థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులు, ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోళ్లపై మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.బి. లోకుర్‌ విచారణ జరుపుతున్నారు. ఈ కమిటీ నివేదికను ప్రభుత్వం ఇంకా బహిర్గతం చేయలేదు.

గత మార్చి అసెంబ్లీ సమావేశాలను టెలిఫోన్‌ ట్యాపింగ్‌ అంశం కుదిపేసింది. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) డీఎస్‌పీ ప్రణీత్‌రావును ఈ కేసుకు సంబంధించి అరెస్ట్‌ చేశారు. అయితే నాటి ఎస్‌ఐబీ చీఫ్‌ టి.ప్రభాకర్‌ రావు, జర్నలిస్ట్‌లు, రాజకీయ నాయకులు, న్యాయమూర్తులపై నిఘా పెట్టేందుకు ఒక టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు ఆయన విచారణలో ఆరోపించారు. ఇంకా అద నపు ఎస్‌.పి.లు తిరుపతన్న, భుజంగరావు, మాజీ డీసీపీ పి. రాధాకృష్ణారావులు కూడా అరెస్ట యిన వారిలో వున్నారు. అయితే ప్రస్తుతం యు.ఎస్‌.లో వున్న టి. ప్రభాకర్‌రావు, ఒక న్యూస్‌ ఛానల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రావణ్‌కుమాలను ఇక్కడికి రప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.ఈ కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌ యాదవ్‌, చిరుమర్తి లింగయ్యలను కూడా పోలీసులు విచారించారు.

ఖాళీగా వున్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం కూడా ఎన్నికల హామీ కావడంతో, రేవంత్‌ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను పునర్‌వ్యవస్థీకరించారు. వివిధ కేటగిరీలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంస్థ పరీక్షలు జరిపి నియామకాలు చేపట్టింది. ఇందులో భాగంగా నే గత ఫిబ్రవరిలో మెగా డీఎస్సీని నిర్వహించి 11,062 పోస్టులను భర్తీ చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 55వేల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేశామని కాంగ్రెస్‌ చెబు తుండగా వీరంతా తమ హయాంలో ఎంపికైన వారేనని బీఆర్‌ఎస్‌ వాదిస్తోంది. కాంగ్రెస్‌ కేవలం వీరికి నియామక పత్రాలు మాత్రమే ఇచ్చిందని బీఆర్‌ఎస్‌ చెబుతోంది.
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు హామీల అమలుకు ఉపక్రమించింది. పగ్గాలు చేపట్టిన రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించింది. మిగిలిన హామీలను అమలు పరచేందుకు బి.పి.ఎల్‌. కుటుంబాలనుంచి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వా నించింది. రేవంత్‌ ప్రారంభించిన ప్రజాపాలన సందర్భంగా 1.05కోట్ల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. రూ.2లక్షల లోపు రైతు రుణాల మాఫీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, బి.పి.ఎల్‌. కుటుంబాలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ వంటి హామీలను కూడా ప్రభుత్వం అమలుచేసింది. 25లక్షల రైతులకు రుణ మాఫీ కింద రూ.21వేల కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశామని, సన్నరకం బియానికి క్వింటాకు రూ.500బోనస్‌ చెల్లించామని ప్రభుత్వం చెబుతోంది. ఇది ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే అధికమని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాదు రైతులకు 24/7 ఉచిత విద్యుత్‌ సరఫరాకు కూడా హామీ ఇచ్చింది.

యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటుతో పాటు, యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ, యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీలను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. రేవంత్‌ ప్రభుత్వ సామాజిక, విద్య, ఉపాధి, రాజకీయ, ఆర్థిక, కుల సర్వేను చేపట్టింది. ఇక సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పెద్ద వివాదానికి దారితీసింది. విపక్ష బీఆర్‌ఎస్‌ ఇది తెలంగాణ తల్లి విగ్రహం కాదు, కాంగ్రెస్‌ తల్లి విగ్రహమంటూ ఎద్దేవా చేసింది. ఈ విగ్రహంలో తెలంగాణ సంస్కృతి చిహ్నమైన బతుకమ్మ ఏదంటూ ప్రశ్నిస్తోంది. తెలంగాణ తల్లిని ‘పేదరాలు’గా చూపించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలావుండగా రేవంత్‌ రెడ్డి, రాష్ట్రంలో కె.సి.ఆర్‌. ప్రవేశపెట్టిన సంప్రదాయాలను చెరిపివేసే పనిలో వున్నారు. ‘టి.ఎస్‌’ స్థానంలో ‘టి.జి’, ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర గీతంగా నిర్ణయించడం ఇందులో భాగమే. హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు ఇతర నీటి తావుల పరిరక్షణ, అక్రమ కట్టడాల కూల్చివేత కు రేవంత్‌ ప్రభుత్వం ‘హైడా’ సంస్థను ఏర్పాటు చేసింది. ఇది పెద్ద వివాదమే రేపింది. తమ్మిడి కుంట చెరువులోని ఫుల్‌ ట్యాంక్‌ ప్రాంతంలోని బఫర్‌జోన్‌లో ఉన్నదంటూ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌`కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేసింది. ఇది 1.12 ఎకరాల మేరకు చెరువును అక్రమంగా ఆక్రమించి నిర్మించారన్న ఆరోపణలున్నాయి. అయితే నాగార్జున కుటుంబం ఈ ఆరోపణలను కొట్టివేసింది. ఇదిలావుండగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ, నాగచైతన్య`సమంత విడాకులపై చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. నాగార్జున మంత్రిపై పరువు నష్టం దావా వేశారు. కె.టి.ఆర్‌. కూడా మంత్రికి వ్యతిరేకంగా మరో పరువునష్టం దావా వేశారు.

పుష్పా2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరగడం, ఒక మహిళ మృతిచెందగా మరో బాలుడు కోమాలోకి వెళ్లిన సంఘటన తెలంగాణలో మరో వివాదానికి దారితీసింది. ఈ కేసులో థియేటర్‌ యాజమాన్యం, సినీ హీరో మరియు ఆయన టీమ్‌పై కేసు నమోదు చేశారు. రేవంత్‌ అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత, అల్లు అర్జున్‌ ప్రెస్‌మీట్‌ పెట్టడం, సినీ పెద్దలు హీరోను పరామర్శించేందుకు క్యూలు కట్టడం పరిస్థితి తీవ్రతను మరింత పెంచాయి. తర్వాత సినీపెద్దలు ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడినప్పటికీ పరిస్థితిలో పెద్దగా చెప్పుకోదగ్గ మార్పు లేకపోవడం వర్తమాన చరిత్ర.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!