పాడి గేదెల పథకం దరఖాస్తు గడువు పొడగింపు
ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఇందిరా
భూపాలపల్లి నేటిధాత్రి
ఎస్సీ యాక్షన్ ప్లాన్ లో భాగంగా (2) పాడి గేదెల పథకం కొరకు దరఖాస్తుల గడువు ఈనెల 23 వరకు పొడిగించబడింది. కావున అర్హులైన అభ్యర్థులు ఈనెల 23 లోగా తమ దరఖాస్తులను నమోదు చేసుకోవాలని, జిల్లా స్థాయి లక్ష్యాల ప్రకారం లబ్దిదారుల ఎంపిక జరుగుతుంది
కావున అర్హత ఆసక్తి గల షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులు ఈనెల 23 గడువు లోపు https://gobmms.cgg.gov.in సైట్ నందు దరఖాస్తు చేసుకుని అట్టి దరఖాస్తు ఫారంను సంబందిత మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఇవ్వగలరు ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవలసిందిగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఇ. ఇందిర ఒక ప్రకటనలు తెలిపారు
