TPCC ప్రచార కమిటీ చైర్మన్ మాజీ M.P. మధు యాష్కీ గౌడ్ ను B.C. రక్షణ సమితి అధ్యక్షులు తీగల ప్రదీప్ గౌడ్ హిమాయత్ నగర్ లోని తన నివాసంలో పరామర్శించారు.
సోమవారం రోజున ఉదయం మధు యాష్కీ గౌడ్ మాతృ మూర్తి అనసూయమ్మ గుండెపోటుతో మరణించారు. ఈ సందర్బంగా మధు యాష్కీ గౌడ్ని పరామర్శించిన వారిలో IJU అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వర్లు, తీగల సతీష్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు M. శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.