
మల్కాజ్గిరి , నేటిధాత్రి
నేరేడ్మెట్ డివిజన్ పరిధిలోని
మధుర నగర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కపిల్, ఎస్సార్ ప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీం సాయి శనివారం అల్వాల్ పిఎస్ లో కపిల్ తనను హత్య చేయడానికి లక్షల రూపాయలు తీసుకున్నాడని ఫిర్యాదు ఇవ్వడాన్ని తీవ్రంగా విమర్శించారు. లేని పోని వన్ని చేపి మాపై బురద చల్లడం అమానుషమని దీన్ని తీవ్రంగా కండిస్తున్నమని తెలిపారు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు ఇక నైనా ఇలాంటి చిల్లరా రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు ఈ కార్యక్రమం లో చెన్నరెడ్డి,టిక్కం,అర్వ రాజు,ప్రభవాతి,యాదగిరి తదితరులు పాల్గొన్నారు