యువ జ్యోతి ఆధ్వర్యంలో టీబి వరల్డ్ డే కార్యక్రమం,,,,
టిబి వ్యాధి రాకుండా నివారణ కు వివరించిన హెల్త్ ఆఫీసర్ భరత్ కుమార్,,,,
సిద్దిపేట ఎన్వైకే సహకారంతో విజయవంతంగా కార్యక్రమం,,,,
రామాయంపేట మార్చి 24 నేటి ధాత్రి (మెదక్)
ప్రపంచంలో టీ బి వ్యాధితో అనేకమంది గతం లో మరణించడం జరిగిందన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా ప్రత్యేకమైన వ్యాక్సిన్ తయారుచేసి మందులతో టీబీ వ్యాధిని చాలా వరకు నివారించడం జరిగిందని రామాయంపేట మండల పి హెచ్ ఎస్ హెల్త్ ఆఫీసర్ భరత్ అన్నారు అయినా కానీ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు కరోనా లాంటి వ్యాధులు రావడానికి టీబిలాంటి వ్యాధులు ఉండడం కూడా ప్రాణాంతక వ్యాధులకు గురవుతారని అన్నారు ముఖ్యంగా తంబాకు పొగాకు సిగరెట్టు గుట్కా పాన్ మసాలా లాంటి వాటితోనే కాకుండా దుమ్ముదులి వాతావరణ కాలుష్యంలో జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల ఈ వ్యాధి ఒకరు నుండి మరొకరికి సోగుతుందని అందుకే

ఈ వ్యాధిని పూర్తిగా నివారించిన తగు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రులకు ధూమపానం పాన్ మసాలా గుట్కా లాంటి వాడుకున్న నివారించుకోవాలని ఇతవు ఈ పలికారు ఈ కార్యక్రమంలో యువజ్యోతి స్పోర్ట్స్ అండ్ యూత్ కోఆర్డినేటర్ సత్యనారాయణ హాస్టల్ మరియు పాఠశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సిద్దిపేట వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సత్యనారాయణ తెలిపారు