నేటిధాత్రి, వరంగల్
వరంగల్ తూర్పు దేశాయిపేట రోడ్డులో ఉన్న సంఘమిత్ర టెక్నో స్కూల్ లోని విద్యార్థులకు, వివిధ విభాగాల్లో మెడల్స్ సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు సర్టిఫికేట్ లు, మెడల్స్ ప్రధానం చేశారు స్కూల్ ప్రిన్సిపాల్ మహేందర్. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ, విశ్వాసం మరియు జీవన నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడే అదనపు మద్దతు అతని/ఆమె భవిష్యత్తుపై ఖచ్చితంగా శక్తివంతమైన, శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది అని, ఐఐటీ ఫౌండేషన్ ప్రోగ్రామ్‌లో మంచి ర్యాంకులు సాధించేందుకు ప్రతి చిన్నారి కష్టపడి పనిచేశారు అని, అందరికీ అభినందనలు తెలిపారు. పేద ప్రజలకు అండగా, పేద విద్యార్థులకు అందుబాటులో అత్యున్నత విద్యను అందిస్తున్న సంఘమిత్ర టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ ను, టీచర్లను విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. సంఘమిత్ర టెక్నో స్కూల్ ఆవరణలో విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి సర్టిఫికేట్లు ప్రధానం చేసిన స్కూల్ యాజమాన్యం. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ మహేందర్, వెంకట్ రెడ్డి, స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.