
నాగర్ కర్నూల్ జిల్లా ::నేటి ధాత్రి
జిల్లాస్థాయి కరాటే పోటీలు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం పటేల్ ఫంక్షన్ హాల్ లో ఉల్లాసంగా జరిగాయి. ఈ ఛాంపియన్షిప్ కరాటే పోటీలకు బిజినేపల్లి, వట్టెం, మహదేవన్ పేట గ్రామాల నుండి 32 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభను కనబరిచారు. 12 మంది విద్యార్థులకు గాను గోల్డ్ మెడల్స్ సాధించగా, పదిమంది విద్యార్థులు సిల్వర్ మెడల్స్, పదిమంది విద్యార్థులు బ్రాంచ్ మెడల్స్ సాధించారు. గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులు ఠాగూర్, వినతి, వైష్ణవి, రితిక, అంకిత, నందిని, హర్షవర్ధిని, హారిక, దివ్య, సంధ్య, లవన్ కుమార్, సుహాన, జిల్లాస్థాయిలో జరిగిన కరాటే పోటీలలో గోల్డ్ మెడల్స్ సాధించారు. సీనియర్ కోచ్, మాస్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ, జిల్లాస్థాయిలో గెలుపొందిన విద్యార్థులు సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 1 2 తేదీలలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో ఈ విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. వ్యక్తిగత క్రీడమ్ షాల్లో తైక్వాండో కు మంచి పేరు ప్రాధాన్యత ఉందన్నారు. గెలుపొందిన విద్యార్థులకు మాస్టర్ శ్రీనివాసులు జిల్లా కార్యదర్శి మాస్టర్ శేఖర్, విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలోమాస్టర్ ధనలక్ష్మి, మాస్టర్ అశోక్, సనా, మరియు నిఖిల్, పాల్గొన్నారు.