రేగొండ,నేటిదాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని న్యూ సైన్స్ కాలేజీలో మెపా ఆధ్వర్యంలో ఫిబ్రవరి 4న జరిగే జాబ్ మేళా కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మెపా కమిటీ సభ్యులు తాళ్ళ రవి ముదిరాజ్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబ్ మేళాలోని పలు కంపెనీల ఇంటర్వ్యూలో పాల్గొని జాబ్ సాధించాలని నిరుద్యోగ యువత కష్టనష్టాలను చలించిపోయి నిరుద్యోగులకు మెపా ఆధ్వర్యంలో పలు జిల్లాలలో జాబ్ మేళాలు నిర్వహిస్తుందన్నారు. నిరుద్యోగులకు అండగా నిలవాలనే ఉద్దేశ్యంతో మెపా ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు.నిరుద్యోగుల జీవితాలకు వెలుగు నింపేదే మెపా అని ఉద్యోగం సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.ఆశక్తి కలవారు మొబైల్ నెంబర్ 8008922956,
9701011801ను సంప్రదించాలని సూచించారు.