
మహబూబాబాద్,నేటిధాత్రి:
యువత మేఘా జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పథంలో పయనించాలని తేజస్వి అన్నారు.మహబూబాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు బాణోత్ శంకర్ నాయక్ – సీతా మహాలక్ష్మి ల ఆధ్వర్యంలో అక్టోబర్ – 09 న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్న సందర్భంగా సమైక్య డిగ్రీ కళాశాల లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సంద్భంగా విద్యార్థులను ఉద్దేశించి కుమారి తేజేస్వి మాట్లాడుతూ యువత అందివచ్చిన ప్రతి అవకాశాలను వినియోగించుకోవాలనీ,జీవితంలో కష్టపడే వారికి ఎన్నటికైనా ప్రతిఫలం ఉంటుందన్నారు.జీవితంలో ఆశయాలకు అవకాశాలు తోడైతే అభివృద్ధి పథంలో పయనించవచ్చునని అన్నారు.ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ మహ్మద్ ఫరీద్,కళాశాల ప్రిన్సిపాల్,సూర్య చంద్ర ,మహేందర్,దుగ్గి కార్తిక్ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.