
ఉచిత వైద్య శిబిరం ను సద్వినియోగం చేసుకోవాలి
మరిపెడ నేటిధాత్రి
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో మూల మర్రి తండ గ్రామపంచాయతీ లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరం లో మొత్తం 60మంది పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయడం జరిగింది.డాక్టర్ రవి మాట్లాడుతూ వర్ష కాలంలో దోమల ద్వారా వ్యాపించే, వ్యాధులు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్య, మెదడు వాపు, బోధకాలు రాకుండా తీసుకోవలసిన జాగ్రత గురించి తండ వాసులకు వివరించారు. ఈ కార్యక్రమం లో తానంచెర్ల పల్లె దవాఖాన మిడ్ లెవెల్ హెల్త్ ప్రోవిడర్ ఝాన్సీ, హెల్త్ సూపెర్వైసోర్ కృష్ణ,లక్ష్మి కుమారి,హెల్త్ అసిస్టెంట్ వీరయ్య, ఏఎన్ఎం రోజమణి, ఆశాలు విజయ, అనిత తదితరులు పాల్గొన్నారు.