
938 రూపాయలకే విద్యుత్ మీటర్లు
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మైలారం గ్రామంలో గృహ జ్యోతి పథకానికి సంబంధించిన సమాచారం విద్యుత్తు సిబ్బంది ఇంటింటికి తిరిగి ప్రజలు విద్యుత్ మీటర్లు బిగించు కోవాలని తెలపడం జరిగింది ఇల్లు కలిగి ఉండి విద్యుత్ మీటర్లు లేకపోతే ఇంటి యజమాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సెప్టెంబర్ 17 రోజున ప్రజాపాలన దరఖాస్తుతో 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును పొంద గలరు. కమలాపూర్ శాయంపేట విద్యుత్ సిబ్బంది మైలారం గ్రామంలో వాడ వాడల తిరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమలాపూర్ ఏఈ రాములు మరియు సిబ్బంది శాయంపేట ఏఈ రాజ్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.