
ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి
దేవరకద్ర / నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 102 వాహనాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు వైద్య సేవల కోసం ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా 102 (అమ్మ వాహనం) అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వైద్య అధికారులు పాల్గొన్నారు.