హర్మన్ ప్రీత్ ప్రపంచ రికార్డు.. అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా..!

హర్మన్ ప్రీత్ ప్రపంచ రికార్డు.. అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా..!

 

టీమిండియా మహిళల జట్టు శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్ ఆడుతుంది. ఇందులో భాగంగా మూడు మ్యాచులు గెలిచిన భారత్.. 3-0తో సిరీస్‌ను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఓ ప్రపంచ రికార్డును నెలకొల్పింది.

టీమిండియా మహిళా జట్టు శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు మ్యాచులు ఆడిన భారత్.. ఇంకా రెండు మ్యాచులు ఉండగానే సిరీస్‌ను దక్కించుకుంది. తిరువనంతపురం వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచులో శ్రీలంకపై టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌ(Harmanpreet Kaur)ర్ ఓ ప్రపంచ రికార్డను నెలకొల్పింది.

అరుదైన రికార్డుకు అడుగు దూరంలో..!

అరుదైన రికార్డుకు అడుగు దూరంలో..!

కటక్ వేదికగా టీమిండియా-సౌతాఫ్రికా మధ్య మరికొన్ని గంటల్లో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో స్టార్ పేసర్ బుమ్రా మరో ఒక్క వికెట్ తీస్తే.. ఈ ఫార్మాట్‌లో వంద వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు.

ఇంటర్నెట్ డెస్క్: నేటి నుంచి సౌతాఫ్రికా-భారత్ మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. మంగళవారం కటక్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. అయితే టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఓ అరుదైన రికార్డుకు అత్యంత చేరువలో ఉన్నాడు. బుమ్రా టీ20 ఫార్మాట్ క్రికెట్‌లో ఇప్పటి వరకు 99 వికెట్లు తీశాడు. కటక్‌లో జరిగే మ్యాచ్‌లో మరో వికెట్ తీస్తే.. వికెట్ల సెంచరీ రికార్డు నెలకొల్పనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్ల(టెస్ట్, టీ20, వన్డే)లో వంద వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్‌గా బుమ్రా చరిత్ర సృష్టించనున్నాడు. అయితే అర్ష్‌దీప్ సింగ్ టీ20లో ఇప్పటికే 100 వికెట్లు తీసినప్పటికీ.. మూడు ఫార్మాట్లలో ఈ రికార్డు అతడికి లేదు.
గణాంకాలు ఇలా..

బుమ్రా తన కెరీర్‌లో ఇప్పటికే సుదీర్ఘ ఫార్మాట్లలో 100 వికెట్ల మార్క్‌ను దాటేశాడు. టెస్ట్ క్రికెట్‌లో 52 మ్యాచులు ఆడిన బుమ్రా 234 వికెట్లు తీసుకున్నాడు. వన్డేల్లో 89 మ్యాచుల్లో 149 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో 99 వికెట్లతో.. వంద వికెట్ల ఫీట్‌ను అందుకోవడానికి అడుగు దూరంలో ఉన్నాడు.

రాణిస్తాడా?

సౌతాఫ్రికాపై బుమ్రా గత రికార్డులు పరిశీలిస్తే.. టీ20 ఫార్మాట్ అతడికి అంతగా కలిసి రాలేదు. ఆఖరిసారి సౌతాఫ్రికాతో 3 టీ20 సిరీస్ ఆడి కేవలం 3 వికెట్లే తీసుకున్నాడు. అయితే తన టీ20 కెరీర్‌లో అత్యధికంగా ఆస్ట్రేలియాపై 20 వికెట్లు, న్యూజిలాండ్‌పై 12 వికెట్లు పడగొట్టాడు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version