లక్ష్మీపురంలో చెరువు పూడిక పనులను పరిశీలించిన డీఆర్‌డీఓ నాగ పద్మజ

లక్ష్మీపురంలో చెరువు పూడిక పనులను పరిశీలించిన డీఆర్‌డీఓ నాగ పద్మజ

ఉపాధి కూలీలకు సౌకర్యాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ

నర్సంపేట, నేటిధాత్రి:

దుగ్గొండి మండలంలోని లక్ష్మీపురం గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన ఊర చెరువు పూడికతీత పనులను డీఆర్‌డీఓ నాగ పద్మజ మంగళవారం పరిశీలించారు.పని ప్రదేశాన్ని సందర్శించిన ఆమె కూలీలతో మాట్లాడి వర్క్ సైట్‌లో కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. పనిచేసే వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా నీడను మరింత ఎక్కువగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఉపాధి పనులకు ఎక్కువ మంది హాజరయ్యేలా ప్రతి 40 మందికి ఒక మేట్‌ను నియమించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లెక్కల అరుంధతి, గ్రామ సర్పంచ్, ఏపీవో డి.శ్రీనివాస్, ఈసీ బి.రాజు, టీఏ మౌనిక, పంచాయతీ కార్యదర్శి కొండల్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్, ఐకేపీ వీవోఏలు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధిహామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీవో సర్పంచ్

ఉపాధిహామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీవో సర్పంచ్

ఉపాధి హామీ పనులకు ఉదయాన్నే రావాలి గుర్రంపేట సర్పంచి రమేష్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి రూరల్ మండలం గుర్రంపేట గ్రామంలో ఉపాధి హామీ పనులను ఆకస్మితంగా తనిఖీ చేసి ఎంపీడీవో తరుణ్ గుర్రంపేట గ్రామ సర్పంచ్ కోడురి రమేష్ ఉపాధి పని కూలీలతో కలిసి వారి సందేహాలు సమస్యలను అడిగి తెలుసుకోని ఉపాధి హామీ పనులు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి వాటిపైన ప్రజలకు అవగాహన కల్పించారు.
ఉదయమే చల్లపూట వచ్చి ఫస్ట్ ఫోటో దిగి పనులు ముగించుకొని ఎండ కాక ముందే రెండో ఫోటో తీసిన తర్వాత వెళ్లాలని, కొలతల ప్రకారం చేస్తే రోజువారీ గరిష్ట కూలీ 307 రూపాయలు వస్తాయని పని ప్రదేశంలో నీడ,మంచినీటి సౌకర్యం, ఫస్ట్ ఎయిడ్ వైద్య చికిత్స కల్పిస్తారని, తెలిపారు.
ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, మేట్స్ డి అరవింద్, బి ఎల్లగౌడ్, జి రాకేష్, టీ అఖిల్, గట్టు శ్రీను. ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version