జిల్లా ఎస్పీ కార్యలములో వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి
నివాళులర్పించిన ఎస్పీ రావుల గిరిధర్
వనపర్తి నేటిదాత్రి
శుక్రవారం జిల్లా పోలీసుకార్యాలయంలో చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్బంగా జిల్లా ఎస్పీ *రావుల గిరిధర్ చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులుర్పించారు
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన ప్రముఖ వీరనారి తెలంగాణ రైతాంగ పోరాటానికి నాంది చాకలి ఐలమ్మ తన చిన్న వయసులోనే భూస్వామ్య వ్యతిరేకంగా శక్తివంతమైన పోరాటాన్ని చేపట్టి, భూములను ఆక్రమించుకున్న నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటo చేశారని అన్నారు
ఈ కార్యక్రమంలో ఏ ఆర్, అదనపు ఎస్పీ, వీరారెడ్డి, డిసిఆర్బీ డిఎస్పీ, ఉమా మహేశ్వర్ రావు కార్యాలయంల ఏఓ, సునందన, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్, పోలీసు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.