న్యాల్కల్‌లో 359వ పీర్ గయాబ్ ఉర్సు పోస్టర్ ఆవిష్కరణ

న్యాల్కల్ లో 359వ పీర్ గయాబ్ ఉర్సు షరీఫ్ పోస్టర్ ఆవిష్కరణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం లోని న్యాల్కల్ మండల కేంద్రంలో 359వ పీర్ గయాబ్ సబ్ ఉర్సు షరీఫ్ కు సంబంధించిన పోస్టర్ ను నిర్వాహకులు ఆవిష్కరించారు. ఈ వేడుకలు జనవరి 30 నుంచి ఫిబ్రవరి 6, 2026 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, చాదర్ సమర్పణ, కవ్వాలీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఉర్సు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, అన్ని వర్గాల భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. పోస్టర్ ఆవిష్కరణతో గ్రామంలో ఉత్సవ వాతావరణం నెలకొంది. ఈ ఉత్సవాల్లో నియోజకవర్గ ప్రజలందరూ పాల్గొని తమ మొక్కులను చెల్లించుకుని విజయవంతం చేయగలరని నిర్వాహకులు కోరారు,

తేది.30-01-2026 శుక్రవారం రా॥ 8 గంలకు మాలి పటేల్ స్వర్గీయ ఉస్మాన్ పటేల్ గారి ఇంటి నుండి సర్కారి గంధం ఊరేగింపు

తేది. 31-01-2026 శనివారం కూరగాయల సంత, న్యాల్కల్, ఝరాసంగం, రాయికోడ్ మండలాల గ్రామాల నుండి గంధం ఊరేగింపు

తేది: 01-02-2026 ఆదివారం మరియు సోమవారం తెలంగాణ రాష్ట్రం కాకుండ మహారాష్ట్రం నుండి మేలైన పశువుల & మేకల సంత రోజుల సంత

బిరుగును. మేలైన పనివులకు శ్రీమతి శ్రీ ధోతి గిరిజాబాయి – అడినప్పు మరియు హెచ్. సురేష్ గార్ల జ్ఞాపకార్థంపై

డా. హొతి బస్వరాజ్, పశువులకు పోశకులకు ప్రోత్సాహకాలు అందజేత, రాత్రి హద్నూర్ గ్రామం నుండి గంధం ఉరేగింపు ఖవ్వాలి జరుగును.

తేది. 02-02-2026 సోమవారం న్యాల్కల్ గ్రామం నుండి ఖురేషి వారి గంధం మరియు బ్రహ్మాడంగా ఖవ్వాలి దర్గ దగ్గర జరుగును మరియు మండలంలోని గుంజెక్ట్, అత్నూర్, డప్పూర్, రుక్మాపూర్, చిలిగెపల్లి, గెజింతల్, మెటల్ కుంట, ముంగి, రాంతీ, ఎల్లోయి గ్రామాల నుండి గంధము వచ్చును.

బి. జ్యోతి – ప్రవీణ్ రూ.25,000/- రెశెట్టి పాటిల్ 20,051/-

5 తులాల వెండి జి. తిరుపతి రెడ్డి, 5 తులాల వెండి యం. సిద్ధలింగయ్య స్వామి, 5 తులాల వెండి పడనంటి వెంకట్, 5 తులాల వెండి అబ్దుల్ ఖాదర్ ఖురేశ కీ.శే. గొల్ల విశత జ్నాపకార్ధం – గొల్ల దత్తు 5 తులాల వెండి షీల్డ్, & అరుణ శ్రీనివాస్ రెడ్డి ముంగి గ్రామ సర్పంచ్ 5 తులాలల వెండి.

కర్నాటక, ఆంధ్రా, మహారాష్ట్ర పాల్గొంటారు.

తేది. 04-02-2026 బుధవారం రోజున న్యాల్ కల్ వర్గ దగ్గరగాయల సంత జరుగును.

తేది. 05-02-2026 గురువారం రోజున రాత్రి 9-00 గం॥లకు ఖవ్వాలి మరియు బజన జరుపబడును.

తేది 06-02-2026 శుక్రవారం రోజున ఉ॥ భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేత

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version