టిఎస్ మీడియా అకాడమీ కార్యదర్శిగా డిఎస్.జగన్
టిఎస్ మీడియా అకాడమీ కార్యదర్శిగా డిఎస్.జగన్ తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ కార్యదర్శిగా డి.ఎస్.జగన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం మసాబ్‌ట్యాంక్‌లోని సమాచార భవన్, మీడియా అకాడమీ కార్యాలయంలో కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వరంగల్ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడిగా పనిచేస్తున్న డి.ఎస్.జగన్‌కు మీడియా అకాడమీ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ అరవింద్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు….