thehsildarlaku gubulu pattukundi, తహశీల్దార్లకు గుబులు పట్టుకుంది
తహశీల్దార్లకు గుబులు పట్టుకుంది ఓవైపు రెవెన్యూశాఖలో ప్రక్షాళన దిశగా సీఎం కేసిఆర్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. మరోపక్క రెవెన్యూ బాధితులంతా తమ గోడును సర్కార్‌కు వెళ్లబోసుకుంటున్నారు. మునుపెన్నడు లేనివిధంగా రెవెన్యూశాఖలో ఉద్యోగుల మూలంగా జరిగిన తప్పిదాలన్ని ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నాలుగు అడుగుల భూమి ఉన్న అది మనదే అనిపించుకోవడం కోసం అటు కబ్జాదారులను ఇటు రెవెన్యూ అధికారులను ఎలా ఎదుర్కొవాలో తెలియక మెజార్టీ జనాలు సతమతం అవుతున్నారు. ఈ నేపథ్యంలో భూకబ్జా ఆరోపణలు వచ్చిన, కబ్జాల్లో తలదూర్చి…