మున్సిపాలిటీ లో బీజేపీ విజయం దిశగా పని చేద్దాం
బీజేపీ యువ నేత వెలిశాల సవీన్
కేసముద్రం/ నేటి దాత్రి
రానున్న మున్సిపాలిటీ ఎలక్షన్లో కేసముద్రం మండలంలో బిజెపి జెండా ఎగురవేయాలని దేశం కోసం ధర్మం కోసం ఎల్లప్పుడు శ్రమించే బిజెపి పార్టీ నీ మున్సిపాలిటీ ప్రజలు ఆదరించాలని రానున్న ఎలక్షన్లలో పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేయాలని బిజెపి యువనేత వెలిశాల సవీణ్ ఓ పత్రిక ప్రకటన ద్వారా వెల్లడించారు.పార్టీ అవకాశం ఇస్తే పార్టీ కోసం ధర్మం కోసం అభివృద్ధి కోసం ఏ స్థానంలో టికెట్ కేటాయించిన నిలబడి గెలవడానికి సిద్ధంగా ఉంటానని తెలిపారు.
