పరకాలలో ఆర్టీసీ కార్మిక సమ్మె

పరకాలలో ఆర్టీసీ కార్మిక సమ్మె

చర్చల పేరుతో కార్మికులను ప్రభుత్వం మోసంచేస్తుంది

సంఘీభావం తెలిపిన డా.పగడాల కాళీ ప్రసాద్ రావు

పరకాల,నేటిధాత్రి

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు చేపట్టిన రాష్ట్రవ్యాప్త సమ్మెకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు,పరకాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు సంఘీభావం తెలిపారు.ఈ మేరకు పరకాల బస్ డిపో సమీపంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.ఆర్టీసీని పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులకు ప్రభుత్వ హోదా కల్పించాలన్నారు.కార్మిక యూనియన్లను పునరుద్ధరించి,దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 90కి పైగా డిపోల వద్ద కార్మికులు శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తున్నారని,ప్రభుత్వం చర్చలకు పిలిచే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు.

చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని,కమిటీల పేరుతో సమస్యలను పక్కదారి పట్టిస్తున్నదని విమర్శించారు.ప్రయాణికులకు కలిగే ఇబ్బందులకు ప్రభుత్వం మరియు యాజమాన్యమే బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గాజుల నిరంజన్, దేవునూరి మేఘనాథ్,కుక్కల విజయ్,ఆకుల లావణ్య శ్రీధర్,కాసగాని రాజ్‌కుమార్ గౌడ్,సంగా పురుషోత్తం,గుండె బోయిన నర్సయ్య,జంగిలి రాజేందర్ రావు,మారేడు కొండ భాస్కరాచారి,మిడిదొడ్డి నరేష్,మెంతుల సురేష్, దంచనాధుల కిరణ్,కానుగుల గోపీనాథ్,చెంతన్ రెడ్డి,ముత్యాల దేవేందర్,కుంట మల్ల గణేష్,దామ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

పరకాలలో బస్సులు బంద్ ప్రభావం

పరకాలలో బస్సులు బంద్ ప్రభావం

బస్టాండ్ ప్రాంగణం నిర్మానుష్యం

పరకాల,నేటిధాత్రి

పరకాల పట్టణంలో బస్సుల బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.సాధారణంగా రోజువారీ ప్రయాణికులతో కిటకిటలాడే బస్టాండ్ ప్రాంగణం ప్రస్తుతం పూర్తిగా నిర్మానుష్యంగా మారింది. ఎప్పుడూ రాకపోకలతో సందడిగా ఉండే ఈ ప్రాంతం, బంద్ కారణంగా నిశ్శబ్ద వాతావరణాన్ని సంతరించుకుని వెలవెలబోతోంది.రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పరకాల బస్టాండ్‌కు వచ్చే,వెళ్లే బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి.దీని ప్రభావంతో ఉద్యోగులు, విద్యార్థులు,వ్యాపారవేత్తలు సహా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా అత్యవసర పనుల కోసం ప్రయాణించాల్సిన వారు గమ్యస్థానాలకు చేరుకోవడం కష్టంగా మారింది.బస్సు సేవలు నిలిచిపోవడంతో ప్రజలు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై ఆధారపడుతున్నారు. ఆటోలు,క్యాబ్‌లు,షేర్ వాహనాల వద్ద ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింది. దీనివల్ల ప్రయాణ ఖర్చులు కూడా పెరిగినట్లు ప్రయాణికులు

 

చెబుతున్నారు.కొందరు వ్యక్తిగత వాహనాలను వినియోగిస్తూ తమ అవసరాలను తీర్చుకుంటున్నారు.ఇదిలా ఉండగా,బస్టాండ్ పరిసరాల్లోని చిన్న వ్యాపారులపై కూడా ఈ బంద్ ప్రభావం పడింది.రోజువారీ ఆదాయంపై ఆధారపడే టీ దుకాణాలు,తినుబండారాల స్టాళ్లు,పండ్ల వ్యాపారులు వంటి వారు వ్యాపారం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.బస్సుల రాకపోకలు లేకపోవడంతో వారి ఆదాయం పూర్తిగా దెబ్బతింది.ప్రస్తుతం బంద్ కొనసాగుతుండటంతో పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయో అనేది అనిశ్చితంగా మారింది. బస్సు సేవలను త్వరితగతిన పునరుద్ధరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version