పరకాలలో ఆర్టీసీ కార్మిక సమ్మె

పరకాలలో ఆర్టీసీ కార్మిక సమ్మె

చర్చల పేరుతో కార్మికులను ప్రభుత్వం మోసంచేస్తుంది

సంఘీభావం తెలిపిన డా.పగడాల కాళీ ప్రసాద్ రావు

పరకాల,నేటిధాత్రి

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు చేపట్టిన రాష్ట్రవ్యాప్త సమ్మెకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు,పరకాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు సంఘీభావం తెలిపారు.ఈ మేరకు పరకాల బస్ డిపో సమీపంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.ఆర్టీసీని పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులకు ప్రభుత్వ హోదా కల్పించాలన్నారు.కార్మిక యూనియన్లను పునరుద్ధరించి,దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 90కి పైగా డిపోల వద్ద కార్మికులు శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తున్నారని,ప్రభుత్వం చర్చలకు పిలిచే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు.

చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని,కమిటీల పేరుతో సమస్యలను పక్కదారి పట్టిస్తున్నదని విమర్శించారు.ప్రయాణికులకు కలిగే ఇబ్బందులకు ప్రభుత్వం మరియు యాజమాన్యమే బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గాజుల నిరంజన్, దేవునూరి మేఘనాథ్,కుక్కల విజయ్,ఆకుల లావణ్య శ్రీధర్,కాసగాని రాజ్‌కుమార్ గౌడ్,సంగా పురుషోత్తం,గుండె బోయిన నర్సయ్య,జంగిలి రాజేందర్ రావు,మారేడు కొండ భాస్కరాచారి,మిడిదొడ్డి నరేష్,మెంతుల సురేష్, దంచనాధుల కిరణ్,కానుగుల గోపీనాథ్,చెంతన్ రెడ్డి,ముత్యాల దేవేందర్,కుంట మల్ల గణేష్,దామ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version