నర్సంపేట ఆర్టీసీ డిపో బీసీ ఉద్యోగుల సంఘం ఎన్నిక…

నర్సంపేట ఆర్టీసీ డిపో బీసీ ఉద్యోగుల సంఘం ఎన్నిక

సెక్రటరీగా బొడిగె రాజు గౌడ్..అధ్యక్షుడిగా కందికొండ మోహన్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

నర్సంపేట ఆర్టీసీ డిపో బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నర్సంపేట డిపో సెక్రటరీగా దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన బొడిగె రాజు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.పురపాలక సంఘం ఆవరణలో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తిరుపతయ్య, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి నిరంజన్ ఆదేశాల మేరకు వరంగల్ ఉమ్మడి జిల్లా రీజినల్ అధ్యక్షులు డాక్టర్ గొలనకొండ వేణు, రీజినల్ కార్యదర్శి మాధారపు సాంబయ్య ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం నర్సంపేట డిపో అధ్యక్షుడిగా డ్రైవర్ కందికొండ మోహన్, డిపో సెక్రటరీగా సీనియర్ కండక్టర్ బొడిగె రాజు గౌడ్ ను అధికారికంగా ప్రకటించారు.

అదే విధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కొలిశెట్టి రంగయ్య, గౌరబోయిన సునిత, ఉపాధ్యక్షులు వేమునూరి గణేష్, సండ సవిత, సహాయ కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్, దద్దనాల ఉమాదేవి, ఆర్గనైజింగ్ సెక్రటరీలు వాకిటి నర్సయ్య, ఆకుల వనిత, గ్యారేజీ సెక్రటరీ బాసాని రమేష్, సహాయ కార్యదర్శి శ్రీరామోజు రవీంద్రచారీ, ప్రచార కార్యదర్శి బూర ప్రవీణ్ కుమార్, మీడియా కార్యదర్శి బొమ్మెర కిరణ్, కోశాధికారి నామాల అశోక్ కుమార్, ముఖ్య సలహాదారులు ఏడీసీలు బత్తిని సాంబయ్య, మంచిక మల్లికార్జున్, ఎం. సంపత్ కుమార్, మార్త రఘువీర్, కమిటీ మెంబర్లుగా గాండ్ల కొమురయ్య, కేఆర్. చందర్, మడిపెద్ది మొగిలి, దేశబోయిన ఓం ప్రకాష్, చీకటి ప్రభాకర్, నాంపెల్లి రాజేందర్, హేమలత, శ్రీలత మరియు చైతన్య ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు కందికొండ మోహన్, బొడిగె రాజు మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో మమ్మల్ని ఏకగ్రీవంగా ప్రకటించిన రీజినల్ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సమస్యల కోసం, సంక్షేమం కోసం పాటుపడతామని అన్నారు. బీసీ ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టి అండగా నిలబడతామని వారి సందర్భంగా హామీ ఇచ్చారు.వరంగల్ రీజినల్ అధ్యక్ష, కార్యదర్శులు వేణు, సాంబయ్య మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అపాయింటెడ్ తేదీ అమలును రెండు సంవత్సరాల నుండి ఆలస్యం చేస్తుందని, అసంతృప్తితోనున్న ఆర్టీసీ కార్మికుల ఆత్మగౌరమైనటువంటి ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే అమలు చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబట్టుకోవాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version