ఎస్సీ ఎస్టీ బీసీ షెడ్యూల్ కులాల హష్టాల్స్ ఏర్పాటు…

ఎస్సీ ఎస్టీ బీసీ షెడ్యూల్ కులాల హష్టాల్స్ ఏర్పాటు

మారపల్లి మల్లేష్ సిపిఐ ఎంఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి

భూపాలపల్లి నేటిధాత్రి

 

టేకుమాట్ల మండల కేంద్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ తో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మరపల్లి మల్లేష్ వి సి కె రాష్ట్ర యూత్ అధ్యక్షులు అంబలా అనిల్ కుమార్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భూక్యా నవీన్ ఆధ్వర్యంలో తాసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో చదువుతున్న పిల్లలకు వసంతి గృహాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ మండలంలో చదువుతున్న విద్యార్థులు కాలేజీ లేక దూరపుప్రాంతాలకు వెళ్లి చదువుకోడానికి ఆర్థికంగా తల్లిదండ్రుల పైన భారం పడుతూ ఉంది రాకపోకల ఇబ్బంది కలుగుతుంది కావున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కాలేజీతోపాటు ఎస్సీ ఎస్టీ, బీసీ హాస్టల్స్ ఏర్పాటు చేసి నిరుపేద పిల్లలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేనియెడల ఆందోళన చేస్తామని వాళ్లు పిలుపునిచ్చారు

అంబేద్కర్ నేషనల్ అవార్డుకు కోంరయ్య ఎంపిక

అంబేద్కర్ నేషనల్ అవార్డుకు కోంరయ్య ఎంపిక

స్పూర్తి సర్వీసెస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మారపెల్లి కొంరయ్య అంబేద్కర్ నేషనల్ అవార్డు కు ఎంపికైనట్లు స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ఎన్జీవోస్ చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్ తెలిపారు. టేకుమట్ల మండల అంబేద్కర్ యువజన సంఘం లో మండల అధ్యక్షులుగా ఇప్పుడు జిల్లా సహాయ కార్యదర్శి గా మారపెల్లి కొంరయ్య గత 25 సంవత్సరాలుగా భారత రాజ్యాంగ రచయిత ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ , భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళుచూ మహనీయుల కార్యక్రమాలను నిర్వహిస్తూ దళితులపై జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు అవమానాలను మహిళలపై జరిగే హత్యలు, అత్యాచారాలపై ఖండిస్తూ వారికి అండగా నిలబడ్డారని అన్నారు వారు చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డు అందించడం జరిగిందని డాక్టర్ రమేష్ చెప్పారు. అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఎంపికైన మారపెళ్లి కొంరయ్య కు నవంబర్ 5న సిటీ కల్చరల్ సెంటర్ ఆడిటోరియం ఆర్టిసి క్రాస్ రోడ్ ముషీరాబాద్ హైదరాబాద్ లో ఈ అవార్డు అందించడం జరుగుతుందని తెలిపారు. కొంరయ్య మట్లాడుతూ నాకు ఈ అవార్డు ఎంపిక చేసిన వారికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version