ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. నేటి నుంచి 9 నెలలపాటు ట్రాఫిక్ మళ్లింపు
ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీఫామ్ రోడ్ వరకు జాతీయ రహదారి 44 పై ఎలివేటెడ్ కారిడర్ నిర్మాణం పనులు ప్రారంభం సందర్భంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నామని జాయింట్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ తెలిపారు. ఈనెల 30 నుంచి 9 నెలలపాటు ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయన్నారు.
