సన్ వాలి హై స్కూల్ అంతర్జాతీయ గుర్తింపు…

సన్ వాలి హై స్కూల్ అంతర్జాతీయ గుర్తింపు

కరస్పాండెంట్ వేముల శంకర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భారతదేశం తరఫున సన్ వాలి హై స్కూల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరస్పాండెంట్ వేముల శంకర్ హాజరైనారు అనంతరం స్వయంగా విద్యార్థులకు రూ. 1001/- నగదు బహుమతి, ప్రశంసా పత్రాలు వ షీల్డ్‌లు అందజేశారు. ఈ సందర్భంగా వేముల కరస్పాండెంట్ శంకర్ మాట్లాడుతూ
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సన్ వాలి హై స్కూల్ కు రెండవ అంతర్జాతీయ గౌరవ అవార్డు రావడం చాలా సంతోషం గతంలో ఈ పాఠశాల ఆస్ట్రియా దేశం నుండి ఐఎస్ఓ సర్టిఫికేట్ పొందింది. ఇప్పుడు మరోసారి విద్యార్థుల ప్రతిభతో అంతర్జాతీయ గుర్తింపు రావడం పాఠశాల ప్రతిష్టను మరింతగా పెంచింది.అని వారు అన్నారు మా విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపడం పాఠశాల విద్యా ప్రమాణాలకు ప్రతీక.
ఈ విజయం పాఠశాల ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల, మరియు తల్లిదండ్రుల సహకారం ఫలితంగా సాధ్యమైంది,
సన్ వాలి హై స్కూల్ ఎల్లప్పుడూ విద్యలో నాణ్యత, క్రమశిక్షణ విలువలతో ముందంజలో ఉంటుంది అని అన్నారు.
ఈ అంతర్జాతీయ విజయాన్ని పురస్కరించుకుని పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

పరిశుభ్రత పై నగరం పాఠశాల….

పరిశుభ్రత పై నగరం పాఠశాల
మండలంలోనే మొదటి స్థానం..

నిజాంపేట ,నేటి ధాత్రి

 

స్వచ్చత పరిశుభ్రత హరిత పాఠశాల కార్యక్రమంలో భాగంగా 2025 సంవత్సరానికి గాను నిజాంపేట మండలం నగరం ప్రభుత్వ పాఠశాల మొదటి స్థానాన్ని దక్కించుకుందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమారాణి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. పాఠశాల పరిశుభ్రత విషయం లో 61 అంశాల్లో పాఠశాల పురోగతిని పరిశీలించి రేటింగ్స్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ రేటింగ్స్ లో మండలంలోని నగరం తండా గ్రామంలో గల పాఠశాల ఫైవ్ స్టార్ రేటింగ్ తో మొదటి స్థానం లో నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు వెంకటేష్, కల్పన ఉన్నారు.

గోవింద్ పూర్ లో ఎన్ ఎస్ ఎస్ స్పెషల్ క్యాంప్ ముగింపు…

గోవింద్ పూర్ లో ఎన్ ఎస్ ఎస్ స్పెషల్ క్యాంప్ ముగింపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జహీరాబాద్ ఆధ్వర్యంలో ఏడు రోజుల ఎన్ ఎస్ ఎస్ స్పెషల్ క్యాంప్ యూనిట్ – 3 ముగింపు కార్యక్రమం గోవింద్ పూర్ గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ నరహరి మూర్తి విద్యార్థులకు సమాజంలోని సమస్యలను తెలుసుకోవడానికి క్యాంపు అవసరాన్ని నొక్కి చెప్పారు.ఎంపిడిఓ మహిందర్ రెడ్డి సమాజ సేవలో యువత భాగస్వామ్యం ప్రాముఖ్యతను వివరించారు. ప్రధానోపాధ్యాయుడు దేవి సింగ్, పంచాయతీ కార్యదర్శి శ్రీమతి సరస్వతి, శివశంకర్ సర్ కూడా హాజరై స్వచ్ఛంద సేవకులను ప్రోత్సహించారు. ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మొహమ్మద్ ముజాఫర్ అలీ శిబిరం విజయవంతం కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. బోధన, బోధనేతర సిబ్బంది, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

అక్షర హైస్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి కరాటేకి ఎంపిక

ఎస్జిఎఫ్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన అక్షర విద్యార్థులు

రామడుగు, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయస్థాయి కరాటే పోటిల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అక్షర హైస్కూల్ ఇ/మీ గుండి-గోపాలరావుపేట విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరచి రాష్టస్తాయికి ఎంపిక అయ్యారు. గుంటి శ్రీనిది, తూడి అకరలు ప్రథమ బహుమతి, తూడి ప్రకాయ్, కమటం అద్వైత రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నారని పాఠశాల కరస్పాండెంట్ మినుగుల మునీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థులను అక్షర హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మినుకుల రాధ, కరాటే మాస్టార్ సుంకెరాజు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, తదితరులు అభినంధించారు.

బీసీ బంద్ విజయవంతం చేయాలి- కేయూ బీసీ టీచర్స్ అసోసియేషన్.

బీసీ బంద్ విజయవంతం చేయాలి- కేయూ బీసీ టీచర్స్ అసోసియేషన్.

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరగబోయే 42% బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కాకతీయ విశ్వవిద్యాలయ బీసీ టీచర్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. శుక్రవారం మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర బీసీ టీచర్స్ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నాగయ్య జనరల్ సెక్రెటరీ డాక్టర్ రమేష్, కాకతీయ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ చిర్ర రాజు, డాక్టర్ శేషు,డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, డాక్టర్ రాధిక, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ మల్లేష్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్, డాక్టర్ విజయ్ పాల్గొన్నారు.

ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు…

ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

కేసముద్రం మండల కేంద్రంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్‌లో బుధవారం భారత మాజీ రాష్ట్రపతి, “మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా”గా పేరుపొందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల రెస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ –
“డాక్టర్ అబ్దుల్ కలాం జీవితమే ఓ ప్రేరణ. సాధారణ కుటుంబంలో పుట్టి, కఠిన శ్రమతో దేశానికి శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా సేవలు అందించారు. విద్యార్థులు ఆయనలా పెద్ద కలలు కనాలి, వాటిని నెరవేర్చే దిశగా కృషి చేయాలి. కలాం చెప్పిన ‘ కలలు కనండి వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేయండి’ అనే వాక్యాన్ని జీవితమంతా మంత్రంలా మార్చుకోవాలి” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

చిరుధాన్యాలు మొలకెత్తిన గింజలతో సంపూర్ణ ఆరోగ్యం…

చిరుధాన్యాలు మొలకెత్తిన గింజలతో సంపూర్ణ ఆరోగ్యం.

చిట్యాల, నేటి ధాత్రి :

 

చిట్యాల మండలంలోని అందుకు తండ గ్రామ పరిధిలోని పోషణ మాసంలో భాగంగా అందుకు తండా గ్రామపంచాయతీ పరిధిలో ఐదుగురు టీచర్లు ఏర్పాటు చేసిన సమావేశమునకు జయప్రద సూపర్వైజర్ హాజరై ప్రతిరోజు చిరుధాన్యాలతో కూడిన భోజనం, మొలకెత్తించిన గింజలను భుజించి, సేంద్రియ ఎరువులు వాడి, పంటలు పండించాలని, వ్యక్తిగత శుభ్రత ,పరిసరాల పరిశుభ్రత, త్రాగునీరు ప్లాస్టిక్ నివారణ గూర్చి వివరించారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్, ప్రతాప్ గారు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదగాలంటే చిన్ననాటి నుండి క్రమశిక్షణతో పెంచుతూ,మొబైల్స్ కు దూరంగా ఉంచుతూ బయట తిను బండారాలు పిల్లలకు పెట్టకుండా ఇంటిలో తయారు చేసిన సమతుల హారము అందించినప్పుడు అన్ని రంగాలలో రాణిస్తారు అని సూచించారు. ఈ ప్రోగ్రాం లో నలుగురు పిల్లలకు అక్షరాభ్యాసము, ముగ్గురు పిల్లలకు అన్నప్రాసన చేయించి అందరితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామ్ సింగ్ గ అంగన్వాడి టీచర్లు కస్తూరి, రజిత ప్రమీల, మమత, ఉమాదేవి, అనూష ,స్వప్న ,ఏఎన్ఎం లావణ్య, ఆశ వర్కర్స్ ఎక్కువ సంఖ్యలో మహిళలు హాజరైనారు. టీచర్స్ ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్స్ చాలా చాలా, ఉపయోగకరమైనది అని మహిళలు హర్షం వ్యక్తం చేశారు.

ఘన పోషణ మాస కార్యక్రమం

ఘన పోషణ మాస కార్యక్రమం

సూపర్వైజర్ అరుణ

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి రూరల్ మండలం పెద్దాపూర్ అంగన్వాడి కేంద్రంలో పోషణ మాస కార్యక్రమాన్ని అంగన్వాడి టీచర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూపర్వైజర్ అరుణ హాజరైనారు అనంతరం మాట్లాడుతూ గర్భిణీలు స్త్రీలు బాలింతలు చిన్న పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంగన్వాడి కేంద్రం నుండి వచ్చిన ఫుడ్డును పిల్లలకు తినిపించాలి దాని ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని అన్నారు అనంతరం అందరితో కలిసి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ విజయలక్ష్మి. వనిత బీ లక్ష్మి రమాదేవి అంగన్వాడి ఆయా రమ ఆశ వర్కర్స్ సుకన్య కోమల గర్భిణీ స్త్రీలు బాలింతలు పాల్గొన్నారు

పాఠశాలను సందర్శించిన ఎండిఎం…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-13T142854.038.wav?_=1

 

పాఠశాలను సందర్శించిన ఎండిఎం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం రామన్న పల్లె గ్రామంలో పాఠశాలను సందర్శించిన ఎం. డి. ఎం. ఈ సందర్భంగా. పాఠశాల పరిశుభ్రత మరియు తరగతి గది పరిశీలన లాంటి. అన్ని అంశాలను రికార్డులను పరిశీలించి. విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని. పాఠశాలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని అలాగే విద్యార్థులను ఆటపాటలతో పాటు చదువులో. ప్రత్యేకంగా రాణించే విధంగా ప్రత్యేక తీసుకోవాలని. ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్. రాజు. భూక్య రాజు నాయక్ విద్యార్థులు తదితరులు ఉన్నారు.

ఆదార్ కేంద్రాన్ని పరిశీలించిన మండల విద్యాధికారి…

ఆదార్ కేంద్రాన్ని పరిశీలించిన మండల విద్యాధికారి

చందుర్తి, నేటిధాత్రి:

 

ప్రాథమిక పాఠశాల సనుగులలో నిర్వహిస్తున్న ఆదార్ నమోదు కేంద్రాన్ని మండల విద్యాధికారి వినయ కుమార్ సందర్శించి జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. పరిసర గ్రామాల బడి పిల్లలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఇంతవరకు వంద పైన అప్డేషన్ లు అయ్యాయని ఇంకా ఎవరైనా పిల్లలు తమ ఆదార్ ని నమోదు చేసుకోకపోయినా, నవీకరణ చేసుకోకపోయినా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని‌ అన్నారు. ఈ కార్యక్రమంలో సనుగుల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కటుకూరి ముఖేష్, సి.ఆర్.పి ఉమ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

దాతల సహాయంతో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు టై బెల్టులు పంపిణీ…

దాతల సహాయంతో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు టై బెల్టులు పంపిణీ.

చిట్యాల, నేటి ధాత్రి :

 

చిట్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టై బ్యాడ్జి బెల్టుల పంపిణీ@
స్థానిక జడ్పీహెచ్ఎస్ చిట్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థుల కోసం దాతల సహాయంతో టై, బ్యాడ్జి బెల్టులను ఎంఈఓ రఘుపతి పంపిణీ చేశారు.
ఇందుకోసం పొగళ్ల మహేందర్ రెడ్డి, దేవ శ్రీధర్,మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సహకారంతో విద్యార్థులకు ఎం ఈ వో రఘుపతి వీటినిపంపిణీ చేశారు.
ఇట్టి కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు బొమ్మ రాజమౌళి, బుర్ర సదయ్య, కూచనపల్లి.శ్రీనివాస్, పిడి సూధం సాంబమూర్తి, రామనారాయణ, ఉస్మాన్ అలీ, నీలిమ రెడ్డి సరళ దేవి,కల్పన, విజయలక్ష్మి, సుజాత, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.

సమాచార హక్కు చట్టంపై అంగన్వాడిలో అవగాహన

సమాచార హక్కు చట్టంపై అంగన్వాడిలో అవగాహన

నర్సంపేట,నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో
పోషణ మాసం సందర్భంగా నర్సంపేట -3 అంగన్వాడి కేంద్రంలో సమాచార హక్కు చట్టం గురించి అవగాహన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు సిడిపిఓ మధురిమ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పౌరులు సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, ఈ చట్టం ద్వారా ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.ప్రతి తల్లి తన బిడ్డల ఆరోగ్య అవసరాలను తీర్చడంతోపాటు, సామాజిక చైతన్యం కూడా అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట సెక్టార్ సూపర్ వైజర్ రమ, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి,స్థానిక అంగన్వాడీ టీచర్ శిరీష,అనిల్ కుమార్, సారయ్య, రాజేష్, శివ, సరోజన, నవ్య, శివాణి, శ్రావణి, రవళి, సుష్మ, ఫర్జానా, రజిని, వనిత,అంగన్వాడీ టీచర్స్ రమ, పద్మ,వాణి, సరస్వతి ఆయా చంద్రకళ,గర్భిణీ, బాలింత స్త్రీలు, తల్లులు, కిషోరబాలికలు పాల్గొన్నారు.

ఫిలాటెలి డే: షైన్ స్కూల్ విద్యార్థుల తపాలా కార్యాలయ సందర్శన

ఫిలాటెలి డే సందర్భంగా తపాలా కార్యాలయం సందర్శించిన షైన్ స్కూల్ విద్యార్థులు

నేటిధాత్రి, వరంగల్:

Vaibhavalaxmi Shopping Mall

ఫిలాటెలి డే సందర్భంగా హనుమకొండ రాంనగర్‌లోని షైన్ ఉన్నత పాఠశాల ఎలైట్ క్యాంపస్ విద్యార్థులు స్థానిక తపాలా కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు పోస్టల్ స్టాంపులను తిలకించి, తపాలా కార్యాలయంలో అందిస్తున్న సేవల గురించి అవగాహన పొందారు. ఈ కార్యక్రమాన్ని ఏఎస్పీ మూల రమాదేవి, పోస్ట్ మాస్టర్ పవన్ కుమార్, పోస్టల్ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు. షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్, డైరెక్టర్లు కవిత, రమ, ప్రిన్సిపల్ ప్రగతి రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు నవదీప్ తదితరులు పాల్గొన్నారు.

జగిత్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన జెడ్పిహెచ్ఎస్ రామాజీపేట్ విద్యార్థిని విద్యార్థులు

జగిత్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన జెడ్పిహెచ్ఎస్ రామాజీపేట్ విద్యార్థిని విద్యార్థులు

 

రాయికల్ , అక్టోబర్ 6, నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

మండలం రామాజీపేట్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడా పోటీలలో ఈనెల 07 -10-2025 నుంచి 10-10-2025 వరుకు వాలీబాల్ కబడ్డీ ఖోఖో క్రీడా పోటీల్లో పాల్గొంటారని ప్రధానోపాధ్యాయులు గజ్జేల నరేందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు లక్ష్మీకాంతం రమేష్ విజయ్ కుమార్ కిరణ్ రమ యశోద వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్.సి.సి విద్యార్థుల ఎంపిక…

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్.సి.సి విద్యార్థుల ఎంపిక
పర్వ తా రోహణ శిక్షణ శిబిరానికి – మొగుళ్లపల్లి ప్రధానోపాధ్యాయులు పింగిలి విజయపాల్ రెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

ఈనెల 25 నుంచి అక్టోబర్ 1 వ తేదీ వరకు 
ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతిలో జరుగు పర్వతాహరణ శిక్షణ శిబిరానికి మొగుళ్ళపల్లి ఉన్నత పాఠశాల ఎన్.సి. సి విద్యార్థులు నలుగురు , ఎం .అర్జిత్ కుమార్ (10వ); బి అరవింద్ (10వ); జే .అరవింద్ (10వ) , పి. వీరమల్లు( 9వ) లు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు శ్రీ పింగిలి విజయపాల్ రెడ్డి ; ఎన్.సి సి అధికారి గుండెల్లి రాజయ్యలు తెలిపారు
ఎంపికైన విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఇలాంటి శిక్షణా శిబిరానికి ఎంపిక అవ్వడం పాఠశాలకు గర్వకారణం అని ఈ శిక్షణ జాతీయ సమైక్యత భావం పెంపొందించుకోవచ్చు, సాహసోపేతమైన కఠినమైన దారుల వెంట నడవడం , క్యాడర్స్ లోపల ఆత్మవిశ్వాసం ధైర్యం సోదర భావాన్ని నెలకొల్పడం కొరకు ఈ శిక్షణను ఇస్తారు అందువల్ల శిక్షణలో
మెలుకువలు తెలుసుకొని దేశభక్తిని పెంపొందించుకొని పాఠశాలకు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని వారిని అభినందించారు
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం. రాజు విద్యార్థులు పాల్గొన్నారు.

అంగన్వాడి లో పోషణ మాస ఉత్సవాలు…

అంగన్వాడి లో పోషణ మాస ఉత్సవాలు .

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని జడల్ పేట, కొత్తపేట గ్రామాలలో పోషణ మాస ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. 11 సంవత్సరాల నుండి కిశోర బాలికలందరు , మహిళలు,సమతుల ఆహారం, వ్యక్తిగత శుభ్రత, పాటిస్తూ బయట వారి మాటలకు, ప్రలోభాలకు, గురి కాకుండా ఉండాలని చెప్పి బరువులు, ఎత్తు లు చూసి, ఐరన్ మాత్రలు ఇచ్చి ప్రతిజ్ఞ చేయించనైనది. అంగన్వాడి టీచర్స్ కూరగాయలతో, పూలతో అలంకరించిన బతుకమ్మలు మట్టితో తయారు చేసిన, బొమ్మల స్టాల్స్ అందరినీ ఆనందపరచాయి. ఈ ప్రోగ్రాంలో ఏఎన్ఎం లహరి, టీచర్స్ వసంత ,మమత ,సాధన ,రమసుజాత, ఉమ, ఆశ వర్కరు సాయి వేద కిశొర బాలికలు హాజరైనారు.

ఏక్ పెడ్ మాకే నామ్ సర్టిఫికెట్ల అందజేత…

ఏక్ పెడ్ మాకే నామ్ సర్టిఫికెట్ల అందజేత

నడికూడ,నేటిధాత్రి:

 

 

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు ఏక్ పెడ్ మాకే నామ్ సర్టిఫికెట్లను తల్లిదండ్రుల సమావేశంలో మొక్కలు నాటిన తల్లులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏక్ పేడ్ మాకేనాం (అమ్మ కోసం ఒక చెట్టు) అనే కార్యక్రమాన్ని తీసుకొని విద్యార్థులలో చెట్ల పెంపకానికి ఉన్న ప్రాధాన్యతను పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు.మొక్క తల్లితో సమానమని విద్యార్థులు అమ్మని ఎలాగైతే ఇష్టపడతారో అలాగే మొక్కను నాటి ఇష్టపడి ఆ మొక్కను కాపాడుతూ ఉండాలని విద్యార్థులను భాగస్వామ్యం చేయడం జరిగిందని అన్నారు.చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో చదువుకునే విద్యార్థిని,విద్యార్థులు అందరూ తమ తల్లులతో మొక్కలు నాటి తమ ఫోటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేసినందుకు గాను మరి కేంద్ర ప్రభుత్వం విద్యార్థులను అప్రిషియేట్ చేస్తూ సర్టిఫికెట్ను ఇవ్వడం జరిగిందనీ ఆ సర్టిఫికెట్ను డౌన్లోడ్ చేసి విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగిందని అన్నారు. అనంతరం పాఠశాలలో బతుకమ్మ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పటు చేసి బతుకమ్మలతో వచ్చి ఆడి పాడిన తల్లులకు ప్రథమ, ద్వితీయ,తృతీయ బహుమతులుగా చీరలను ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లక్కవత్ దేవా,కంచ రాజకుమార్,మేకల సత్యపాల్,పుల్లూరి రామకృష్ణ,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కందికట్ల రమ,అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మీ, నందిపాటి సంధ్య మరియు తల్లిదండ్రులు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

ఎస్.జి.ఎఫ్ ఆధ్వర్యంలో అండర్-14 బాలుర ఎంపిక పోటీలు…

ఎస్.జి.ఎఫ్ ఆధ్వర్యంలో అండర్-14 బాలుర ఎంపిక పోటీలు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో ఎస్.జి.ఎఫ్ అండర్-14 బాలుర ఎంపిక పోటీలు శనివారం టీజీఎస్‌డబ్ల్యూఆర్ఎస్ ఆధ్వర్యంలో (కోటపల్లి) ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ పోటీలకు జిల్లాలోని వివిధ పాఠశాలల నుండి 200 పైగా క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.ఈ పోటీలను సీఐ వేణుచందర్ ప్రారంభించారు.ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పీడీలు,పీటీలు తమ విద్యార్థులతో పాల్గొని పోటీలను విజయవంతం చేశారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ప్రిన్సిపాల్ శ్రీనివాస్ వ్యవహరించగా,ముఖ్య అతిథులుగా సీఐ శ్రీరాంపూర్ వేణు చందర్,తహసిల్దార్ వనజ రెడ్డి,ఎంపీడీవో సత్యనారాయణ గౌడు,ఎస్సై శ్రీధర్,టీజీఎస్‌డబ్ల్యూఆర్ఎస్ ప్రిన్సిపాల్ శ్రీధర్,జైపూర్ హైస్కూల్ హెచ్‌.ఎం.శ్రీనివాస్, ఎస్జిఎఫ్ సెక్రటరీ యాకూబ్,ఆబ్జర్వర్ ఫణిరాజా,నిర్వాహక కార్యదర్శి సాయి (పీడీ కోటపల్లి),వ్యాయామ ఉపాధ్యాయ సంఘ బాధ్యులు సుదర్శన్,బెల్లం శ్రీను,గాజుల శ్రీను,సిరంగి గోపాల్ తో పాటు సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు రోజీ వర కుమారి,దాసరి మల్లేష్,పున్నం,వహీదా బేగం,పద్మ,బోయిని శ్రీనివాస్,సత్యనారాయణ,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.

“గురుకుల పాఠశాల తనిఖీ…

“గురుకుల పాఠశాల తనిఖీ”

బాలానగర్ /నేటి ధాత్రి

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో కలెక్టర్ విజయేందిర బోయి జనరల్ బాలికల పాఠశాల & కళాశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ చేశారు. గురుకుల పాఠశాల వంటగదిరిని పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనమును అందించాలన్నారు. బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజన రుచిని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శంకర్ నాయక్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సౌమ్య, కృష్ణవేణి, శోభారాణి, సాయి లక్ష్మి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థులకు మొక్కల పంపిణీ…

విద్యార్థులకు మొక్కల పంపిణీ
• నిర్మాణాలు త్వరగా పూర్తి చెయ్యాలి.
• ఎంపీడీవో రాజీరెడ్డి.

నిజాంపేట: నేటి ధాత్రి

 

తల్లి పేరు మీద ఒక మొక్క అనే కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి పాఠశాల విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ మేరకు నిజాంపేట మండలం నగరం తాండ గ్రామంలో గ్రామ కార్యదర్శి ఆరిఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో రాజీరెడ్డి హాజరయ్యారు. పాఠశాల విద్యార్థులకు ఒక్కొకరికి ఒక్కో మొక్కను ప్రధానం చేశారు. గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి త్వరితగతిన ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ సంధ్య, ప్రధానోపాధ్యాయులు ఉమారాణి, ఉపాధ్యాయులు వెంకటేష్, కల్పన, స్రవంతి విద్యార్థులు, గ్రామస్తులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version