హనుమకొండ జిల్లా పట్టణ పరిధిలోని ఆరోగ్య కేంద్రాలను పరిశీలించిన డిఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య
హన్మకొండ జిల్లా, నేటిధాత్రి (మెడికల్):
హనుమకొండ డిఎంహెచ్ఓ డాక్టర్ ఏ.అప్పయ్య ఈరోజు పట్టణ పరిధిలో ఆరోగ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు.
లష్కర్ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలో టీబీ చికిత్స పొందుతున్నవారికీ దాతల సహకారంతో పోషకాహార కిట్ల ను అందించడం జరిగింది. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ అప్పయ్యనీ స్ఫూర్తిగా తీసుకొని ఇద్దరికీ చికిత్స కాలంలో ఆరు నెలల వరకు పోషకార కిట్ లను అందించడానికి ముందుకు వచ్చిన నర్సింగ్ ఆఫీసర్ శ్రీమతి మేరీ కరుణను ఆయన అభినందించారు. ఇప్పటివరకు ప్రైవేట్ ఆస్పత్రుల యజమాన్యాలు , రెడ్ క్రాస్,మనూస్ స్వచ్ఛంద సంస్థలు పోషకాహారకిట్లు అందిస్తున్నాయని, అలాగే తనతో పాటు వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న డాక్టర్లు సిబ్బంది కూడా ముందుకు రావడం అభినందించ తగ్గదని ఆయన అన్నారు. డాక్టర్ హిమబిందు (1)వంగర వైద్యాధికారి డాక్టర్ ముతిర్ రెహమాన్ ( 2 ), నేరేడుపల్లి పల్లె దవఖాన వైద్యాధికారి డాక్టర్ వినోద్ కుమార్ (4 ) , హెల్త్ సూపర్వైజర్ పి విప్లవ కుమార్ ( 5) వెంకటేశ్వర్లు(1) పోషకాహార కిట్లను అందిస్తున్నారని అన్నారు.
లష్కర్ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని సందర్శించి చికిత్స నిమిత్తం వచ్చిన వారితో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకున్నారు అలాగే వాజ్పేయి కాలనీలో డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించారు..కాలనీ లో పాత సామాను దుకానం లో నీరు నిలువ ఉన్న వస్తువు లను తొలగించాలని కోరారు. కొన్ని గృహాలను సందర్శించి వివరాలు ఇతర ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
శాయంపేట పట్టణ ఆరోగ్యకేంద్రంలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా క్లినిక్ ను సందర్శించారు. ఇప్పటివరకు 27 మందిని పరీక్షించినట్లు అందులో ఐదుగురికి రక్తపరీక్షలు సేకరించినామని అలాగే ఒకరిని మరిన్ని పరీక్షల నిమిత్తం రెపర్ చేసినట్లు గుర్తించడం జరిగింది.
ఇందులో అడిషనల్ డి ఎం హెచ్ ఓ డాక్టర్ డి మదన్ మోహన్ రావు జిల్లా టీవీ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు, వైద్యాధికారులు డాక్టర్ హైదర్ డాక్టర్ మౌనిక జిల్లా మాస్ మీడియా అధికారి వి అశోక్ రెడ్డి, సూపర్వైజర్ బాబు, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఏఎన్ఎంలు ,ఆశాలు పాల్గొన్నారు.