
సుద్దాల హనుమంతరావు జీవితం పేద ప్రజలకే అంకితమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు
మహబూబ్ నగర్/ నేటి ధాత్రి నిజాంకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో పాటయే ఆయుధం అయిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన సుద్దాల హనుమంతు సాంస్కృతిక ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సుద్దాల హనుమంతు కవిగా కళాకారుడిగా, వాగ్గేయకారుడిగా అంతకుమించి జీవితమంతా కష్టజీవుల కోసం అంకితం అంకితం చేశారన్నారు. తెలంగాణ జాతి యావత్తును…