బురదమయమైన రోడ్లు పట్టించుకోని అధికారులు
ఆజంనగర్ పెగడపల్లికి రోడ్డు మరమ్మత్తులు చేయాలి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి రూరల్ మండలం ఆజం నగర్ గ్రామం నుండి పెగడపల్లికి సరైన రోడ్డు లేక మధ్యలో ఉన్న చిన్న వాగు భారీ వర్షాలు కురిసినట్లైతే దాటలేక పోతున్న రెండు గ్రామాల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు ఆజాంనగర్ గ్రామ రైతులు పొలాల వద్దకు వెళ్లాలంటే చిన్న వాగు దాటి వెళ్లాలి అంటే రోడ్డు లేక బుర్దమయమైన రోడ్లో నడుచుకుంటూ వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల వద్దకు వెళ్లాలంటే అనేక ఇబ్బందులకు గురవుతున్నారు
ఆజాంనగర్ ప్రగడపల్లి గ్రామాల మధ్య చిన్న వాగు పై బిర్జి నిర్మాణం లేక భారీ వర్షాలు కోవడం వలన రైతుల యొక్క డాక్టర్లు చిన్నవాగులో కొట్టుకపోయినా అయినా జిల్లా అధికారులు స్పందించడం లేదు ఇప్పటికైనా జిల్లా రైతులు స్పందించి ఆజంనగర్ పెగడపల్లి మధ్యలో ఉన్న చిన్న వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు
* ఆజంనగర్ రైతు తుమ్మేటి దామోదర్ రెడ్డి ని వివరణ కోరగా ఆజంనగర్ పెగడపల్లి మధ్యలో మట్టి రోడ్డు ఉండడంతో మా రెండు గ్రామాల ప్రజలకు అనేక ఇబ్బందులకు గురవుతున్నాం వ్యవసాయ పని నిమిత్తం పనుల కోసం వెళ్లాలి అంటే రోడ్డుపై బురదలో నడుచుకుంటూ వెళ్లాలి అలాగే వర్షాకాలం వచ్చిందంటే భారీ వర్షాలు కురవడం వలన రోడ్డు మొత్తం బురదమయం అవుతుంది అలాగే రెండు గ్రామాల మధ్య ఉన్న చిన్న వాగు దాటలేక పోతున్నాం రెండు గ్రామాలకు రాకపోకలు బంద్ అవుతున్నాయి వ్యవసాయ పనులకు వెళ్లలేక పోతున్నాం గతంలో చిన్న వాగులో రైతుల వ్యవసాయ ట్రాక్టర్లు పనిముట్లు కొట్టుకపోయినా
* ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులకు ప్రజాప్రతినిధులకు జిల్లా అధికారులకు ఆజాంనగర్ పెగడపల్లి గ్రామాల ఓటర్లు గుర్తుకు వస్తున్నారు ఓట్లు వేయించుకొని తర్వాత మా గ్రామాల ప్రజలను మర్చిపోతున్న ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి చిన్నవాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని రెండు గ్రామాల ప్రజలు స్థానిక ఎమ్మెల్యేను జిల్లా కలెక్టర్ ను కోరుతున్నాం