సంగారెడ్డి జిల్లాలో 13.7 సెంటీమీటర్ల వర్షం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-16-4.wav?_=1

సంగారెడ్డి జిల్లాలో 13.7 సెంటీమీటర్ల వర్షం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం : సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి
వర్షం దంచి కొట్టింది. దీంతో చెరువులు, కుంటలు, బోరు బావులకు భారీగా నీరు చేరి చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పంట పొలాలకు నీరు చేరింది. జిల్లాలోని పుల్కల్ (లక్ష్మీ సాగర్) 13.7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు కాగా మొగుడంపల్లి 0.73 సెంటీమీటర్ల అతి తక్కువ వర్షపాతం నమోదయింది. ఝరాసంగం వాలాద్రి వాగు పొంగి ఏడాకులపల్లి, ప్యారవరం, ఎల్లోయి, జీర్లపల్లి చెరువు పొంగడంతో మంజీరాకు వరద నీరు వెళుతుంది. ప్యారవరం వాగు ఎప్పటి మాదిరిగానే పొంగిపొర్లుతోంది. కుప్పానగర్, మచ్నుర్, కృష్ణాపూర్, బర్దిపూర్, జీర్లపల్లి, ఝరాసంగం, కక్కెర వాడ, చిలేపల్లి, చిలపల్లి తండా, దేవరంపల్లి, ఈదులపల్లి, మేదపల్లి, ఏడాకులపల్లి, కృష్ణాపూర్ తదితర గ్రామాల్లో వర్షం దంచి కొట్టింది. జహీరాబాద్ మండలం హుగ్గేల్లి నుంచి బర్దిపూర్ శివారు వరకు ఉన్న జాతీయ పెట్టుబడి రహదారికి ఇరువైపులా పంట పొలాల్లో భారీగా నీరు చేరింది. పంట పొలాలు వాగులను తలపిస్తున్నాయి.

జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు..

పుల్ కల్ (లక్ష్మీసాగర్) – 13.7 సెంటీమీటర్లు

గుమ్మడిదల (నల్లవల్లి) – 9.70 సెంటీమీటర్లు

చౌటకూర్ (చౌటకూర్) – 8.89 సెంటీమీటర్లు

అమీన్ పూర్ (సుల్తాన్ పూర్) – 8.10 సెంటీమీటర్లు

ఝరాసంగం (ఝరాసంగం) – 7.48 సెంటీమీటర్లు

నిజాంపేట్ (నిజాంపేట్) – 6.60 సెంటీమీటర్లు

పుల్ కల్ (పుల్ కల్) – 5.93 సెంటీమీటర్లు

రాయికోడ్ (రాయికోడ్) – 5.73 సెంటీమీటర్లు

హత్నూర్, వట్ పల్లి, అమీన్ పూర్, జిన్నారం ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కాగా పటాన్ చెరువు, రామచంద్రపురం, సదాశివపేట్, జహీరాబాద్, కంది ప్రాంతాల్లో 4 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయింది. మిగతా ప్రాంతాల్లో మోస్తారుగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

జహీరాబాద్‌లో ఉప్పిట్ హోటల్ ప్రారంభం…

ఉప్పిట్ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహిరాబాద్ పట్టణం దత్తగిరి కాలనిలో జరిగిన ఉప్పిట్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నామా రవికిరణ్,విష్ణువర్ధన్ రెడ్డి,చల్లా శ్రీనివాస్ రెడ్డి,చెంగల్ జైపాల్,సంగారెడ్డి,బి.విఠల్,నరేష్,మనోజ్,దిలీప్,తదితరులు పాల్గొన్నారు

ప్యాలవారం లో దంచికొట్టిన వాన..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-23-2.wav?_=2

ప్యాలవారం లో దంచికొట్టిన వాన

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని ప్యాలవారం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగి, రోడ్లు, వీధులు జలమయమయ్యాయి. నెలరోజుల తర్వాత కురిసిన వర్షానికి పంట చేనులో నీరు చేరడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా క్రమం తప్పకుండా కురుస్తున్న వర్షం పంటలను దెబ్బతీస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈసీజీ టెక్నీషియన్ నిర్లక్ష్యంపై రోగుల ఆందోళన.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-1-2.wav?_=3

ఈసీజీ టెక్నీషియన్ నిర్లక్ష్యంపై రోగుల ఆందోళన.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఈసీజీ టెక్నీషియన్ నిర్లక్ష్యంపై రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు వందలాది మంది రోగులు వచ్చే ఈ ఆసుపత్రిలో, అత్యవసర రోగులకు ఈసీజీ తీయాల్సిన టెక్నీషియన్ ఇష్టానుసారంగా విధులకు హాజరవుతున్నారు. ఆయన లేని రోజుల్లో ట్రైనింగ్ నర్సులు, పేషెంట్ కేర్ సిబ్బందితో ఈసీజీలు తీయిస్తున్నారని, దీనిపై అధికారులు పట్టించుకోవడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు.

జహీరాబాద్ లో భారీ వర్షం.

జహీరాబాద్ లో భారీ వర్షం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలో గత రాత్రి నుండి ఎడతెరపి లేకుండా కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. దీనివల్ల సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక వర్షాల వల్ల ఇండ్లలోకి నీరు సైతం వస్తున్నాయి. అంతేగాక రోజువారి పనులు చేసుకునే వారికి చాలా ఇబ్బందిగా ఉన్నది. ఉద్యోగస్తులు సైతం సమయానికి వెళ్లలేకపోతున్నారు. ఎక్కువ శాతం పాఠశాలలు సెలవులను ప్రకటించాయి. ఈ వర్షాకాలం సీజన్లో ఇంత భారీ వానలు పడడం ఇదే మొదటిసారి. ఈ భారీ వర్షాల్లో ప్రయాణికులు తగిన జాగ్రత్తలు పాటించాలి.

సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ బీసీలకు కేటాయించాలి.

సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ బీసీలకు కేటాయించాలి.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2-1.wav?_=4

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా పరిషత్ పదవులు బీసీలకే ఇవ్వాలి: బీసీ నాయకుల డిమాండ్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని బీసీ నాయకులు జిల్లా స్థాయిలో రాజకీయ న్యాయం జరగాలంటూ బీసీలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 26 జెడ్పిటిసి స్థానాలు, 26 ఎంపీపీలు, 271 ఎంపీటీసీలు ఉన్న వేళ, వీటిలో కనీసం 42 శాతం స్థానాలు బీసీలకు కేటాయించాలని బీసీ సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. పాలకులు సామాజిక న్యాయంపై మాట్లాడే సమయంలో, జాతీయ జనాభా గణాంకాలను దృష్టిలో పెట్టుకొని బీసీలకు తగిన వాటా కచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు చెప్పారు. ప్రత్యేకించి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి బీసీకి ఇవ్వాలని, ఇది బీసీ సామాజిక వర్గానికి గుర్తింపు కలిగించే అంశమని పేర్కొన్నారు. పనులు, పథకాల అమలులో బీసీల పాత్ర కీలకమైందని, గ్రామ స్థాయినుంచి జిల్లా స్థాయి వరకు నాయకత్వం ఇచ్చి బీసీల ఎదుగుదలకి మార్గం వేయాలని జిల్లా బీసీ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. డెలిమిటేషన్ ప్రక్రియలో బీసీలకు న్యాయం చేయాలని, రాజకీయ వేదికలపై కూడా ఈ అంశాన్ని ఎత్తిచూపుతామని హెచ్చరించారు. జిల్లా నాయకులు కొండాపురం నర్సింలు ముదిరాజ్ మహమ్మద్ ఇమ్రాన్ బీసీ మైనార్టీ అధ్యక్షుడు డాక్టర్ పెద్ద గొల్ల నారాయణ శ్రీనివాస్ గౌడ్ రాకేష్ రాజు దత్తు రవీందర్ నారాయణఖేడ్ సాయిలు ఆందోల్ రాజన్న సంగారెడ్డి విశాల్ డిమాండ్ చేశారు.

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి ఉత్సవాలు .

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి ఉత్సవాలు…

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: ఝరాసంగం మండలం బర్దిపూర్లోని శ్రీదత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో గురు పౌర్ణమి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. కేంద్ర మాజీ మంత్రి భగవత్ ఖాభ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతులు మాతృశ్రీ అనసూయ మాత, శ్రీఅవధూత గిరి మహారాజ్, డాక్టర్ సిద్దేశ్వరానందగిరి ఆధ్వర్యంలో రథోత్సవం భక్తుల సందోహంతో రమణీయంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భజనలు, నృత్యాలతో రథోత్సవం ఆకట్టుకుంది.

తహశీల్దార్ కార్యాలయం వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం.

తహశీల్దార్ కార్యాలయం వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్ తహశీల్దార్ కార్యాలయం దగ్గర ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని శేఖర్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తన కుమారుడి బర్త్ సర్టిఫికెట్ కోసం నెల రోజుల నుంచి తహశీల్దార్ కార్యాలయం చుట్టూ శేఖర్ తిరుగుతున్న ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదంటూ ఆత్మహత్యాయత్నం చేశాడు. శేఖర్ ను సిబ్బంది అడ్డుకున్నారు.

రేషన్ డీలర్ల కృషిని గుర్తించాలి.

రేషన్ డీలర్ల కృషిని గుర్తించాలి’

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి: అధికారులు ఏ ఆదేశాలు జారీచేసిన వాటిని ఎంత కష్టమైనా ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా కష్టపడడంలో రేషన్ డీలర్లు ఎప్పుడు ముందుంటారని కోహీర్ మండల రేషన్డీలర్ల సంఘం అధ్యక్షుడు గరుగుబాయి అశోక్ తెలిపారు. ప్రభుత్వాలు రేషన్ పంపిన విషయాన్ని చెప్పుకుంటున్నాయంటే కారణం దాని వెనుక ప్రభుత్వ అధికారుల తర్వాత రేషన్డీలర్లే అని అన్నారు. వారి కృషిని ప్రభుత్వం గుర్తుంచి కమిషన్ అమలుచేయాలని కోరారు.

డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆందోళన

డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆందోళన

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్లో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. ఏడాదిన్నర క్రితం ఇళ్లు కేటాయిస్తూ మంజూరుపత్రాలు జారీచేసినా ఇళ్లను అప్పగించడంలేదని స్థానిక మండల రెవెన్యూ కార్యాలయాన్ని సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడించారు. ఆందోళనపై స్పందించిన అధికారులు ఈనెల 7వ తేదీలోపు ఇళ్లతాళాలు లబ్ధిదారులకు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. లబ్దిదారులకు తాళాలు ఇవ్వనిపక్షంలో ఆందోళన చేపడతామని సీపీఎం నాయకుడు మహిపాల్ హెచ్చరించారు.

డీఈవో సంగారెడ్డి వెంకటేశ్వర్లు గారి నుండి ఉత్తర్వులు అందుకుంటూ.

డీఈవో సంగారెడ్డి వెంకటేశ్వర్లు గారి నుండి ఉత్తర్వులు అందుకుంటూ…

జహీరాబాద్ నేటి ధాత్రి:

జాతీయ స్థాయి న్యూఢిల్లీలో 15 రోజుల పాటు జరిగే సి.సి.ఆర్.టి. కార్యక్రమానికి ఎంపికైన ప్రాథమిక పాఠశాల రెజింతల్ ప్రధానోపాధ్యాయురాలు సఫియా సుల్తానా
బెస్ట్ ప్రాక్టీసెస్‌లో భాగంగా, జూన్ నెలలో జరిగిన రాష్ట్ర స్థాయి మండల విద్యాధికారుల సమావేశంలో అన్ని జిల్లాల నుండి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసిన 110 మంది ఉపాధ్యాయులు తమ వినూత్న విద్యా విధానాలను ప్రదర్శించారు. ఈ సమావేశం ఎస్ సి ఈ ఆర్ టి ఆధ్వర్యంలో ఎంసీఆర్ హెచ్ ఆర్ డి, హైదరాబాద్ లో నిర్వహించబడింది.ఈ సందర్భంగా ఉన్నతాధికారులు ఉపాధ్యాయుల ప్రదర్శనలను గమనించి జాతీయ స్థాయిలో 15 రోజుల సీసీ ఆర్ టి (Centre for Cultural Resources and Training) శిక్షణకు ఎంపిక చేశారు.
దీంట్లో భాగంగా సంగారెడ్డి జిల్లా నుండి రేజింతల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సఫియా సుల్తానా గారు ఎంపిక అయ్యారు . తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాథమిక పాఠశాలలకి చెందిన 10 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు.

ఇతర జిల్లాల ఎంపికల వివరాలు ఇలా ఉన్నాయి:

జగిత్యాల జిల్లా – 2

ములుగు జిల్లా – 2

మెదక్ జిల్లా – 1

వికారాబాద్ జిల్లా – 1

మంచిర్యాల జిల్లా – 1

యాదాద్రి జిల్లా – 1

నిర్మల్ జిల్లా – 1

సంగారెడ్డి జిల్లా – 1 ( సఫియా సుల్తానా )

ఈ ఎంపికకు సంబంధించి ఎస్ సి ఈ ఆర్ టి డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు
సంగారెడ్డి జిల్లా విద్యాధికారి. వెంకటేశ్వర్లు గారి నుండి.సఫియా సుల్తానా దానికి సంబంధించిన ఉత్తర్వులు నిన్న అందుకున్నారు.
ఈ సందర్భంగా డీఈవో సంగారెడ్డి సఫియా సుల్తానా గారిని ప్రత్యేకంగా అభినందించారు.

సంగారెడ్డి జిల్లాలో వింత బ్రహ్మంగారి.!

సంగారెడ్డి జిల్లాలో వింత.. బ్రహ్మంగారి భవిష్యవాణి నిజమవుతోందా?

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: సంగారెడ్డి జిల్లాలో ఒక ఆశ్చర్యకరమైన
చోటు చేసుకుంటుంది. ఝరాసంగం మండలంలోని ఈదులపల్లి గ్రామ శివారులో ఉన్న ఒక రావి చెట్టు నడిమధ్య నుండి ఒక ఈత చెట్టు మొలకెత్తి పెద్దగా పెరిగింది. ఒక చెట్టు మొదలు నుండి వేరొక చెట్టు పెరగడం చాలా అరుదు. కానీ ఇక్కడ రెండు రకాల చెట్లు ఒకే చోట పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ అద్భుతం చూసిన స్థానికులు, బ్రహ్మంగారు చెప్పిన భవిష్యత్తు నిజమవుతున్నాయని అనుకుంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితమే ఈ చెట్లు ఇక్కడ ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇంకెన్ని వింతలు చూడాల్సి వస్తుందని గ్రామ ప్రజలు అంటున్నారు

ఘనంగా ఎంఐఎం ఆవిర్భావ దినోత్సవం.

ఘనంగా ఎంఐఎం ఆవిర్భావ దినోత్సవం

జహీరాబాద్. నేటి ధాత్రి:

MIM

వార్త ఏమిటి: సంగారెడ్డి జిల్లాలో శాసనసభనియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గల రోడ్లు భవనాల విశ్రాంతి గృహం ఆవరణలో శనివారం ఉదయం ఎంఐఎం ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు, ఎంఐఎం అద్యక్షులు అత్తర్ అహ్మద్ తెలిపారు. ఈకార్యక్రమంలోపలువురుఎంఐఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంగారెడ్డి కాంగ్రెస్ సారథిగా… ఉజ్వల్ రెడ్డి?

■డీసీసీ అధ్యక్షుడిగా నియమించేలా అధిష్టానం కసరత్తు

” దాదాపుగా ఖరారు.. త్వరలో అధికారికంగా ప్రకటన

■జిల్లా కీలక నేతలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిర్ణయం

జహీరాబాద్. నేటి ధాత్రి:

కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి జిల్లా పగ్గాలు డాక్టర్ సిద్ధంరెడ్డి ఉజ్వల్ రెడ్డికి అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఆయన పేరు ఇప్పటికే దాదాపుగా ఖరారైంది. అధి కారికంగా ప్రకటించడమే మిగిలినట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడా దిన్నర కావొస్తున్న తరుణంలో కొన్ని జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులుగా కొత్తవారికి అవకాశం ఇచ్చేలా పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా ఉజ్వల్ రెడ్డిని నియమిం చేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై మంత్రి దామోదర్ రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అమెరికాలో వైద్యుడిగా సేవలు!

జహీరాబాద్ మండలం చిరాగ్ పల్లికి చెందిన సిద్దం రెడ్డి ఉజ్వల్ రెడ్డి కొన్నేళ్లుగా అమెరికాలో వైద్యుడిగా సేవలందిస్తూ వచ్చారు. మరోవైపు ఉజ్వల్ ఫౌండేషన్ స్థాపించి ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తు న్నారు. పన్నెండేళ్లుగా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలో తన ట్రస్టు ద్వారా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు యువతను క్రీడల వైపు ప్రోత్సహించేలా వివిధ పోటీలనూ నిర్వహిస్తుంటారు.
వీరి కుటుంబానికి స్థానికంగా మంచి పేరుంది. ఉజ్వల్ రెడ్డి తండ్రి నారాయణరెడ్డి గతంలో జహీరా బాద్ ఎంపీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉజ్వల్ రెడ్డి జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగానూ కృషి చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి.. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా సారథిగా ఆయనను నియమించేలా కసరత్తు పూర్తయింది.

కార్పొరేషన్ చైర్ పర్సన్ పదవి ఇవ్వడంతో!

నిర్మలా జగ్గారెడ్డి ప్రస్తుతం సంగారెడ్డి డీసీసీ అధ్యక్షు రాలిగా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన
తర్వాత ఆమెకు టీజీఐఐసీ చైర్ పర్సన్ గా అవకాశం
ఇచ్చారు. ప్రస్తుతం ఆమె టీజీఐఐసీ కార్పొరేషన్
ఛైర్ పర్సన్ తో పాటు జిల్లా అధ్యక్షురాలిగానూ
కొనసాగుతున్నారు. దీంతో ఈసారి ఉజ్వల్ రెడ్డిని
సారథిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.
అతి త్వరలోనే ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
గత ఎన్నికల్లో ఆయన జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు ప్రయత్నించారు. చివరకు పార్టీ అధిష్టానం సురేష్ షెట్కార్ వైపే మొగ్గింది. ఈ క్రమంలో ఉజ్వల్ రెడ్డికి జిల్లా పగ్గాలు అప్పగించేలా అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version