జీవితంపై విరక్తితో ఆత్మహత్య
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నవంబర్ 23: జీవితంపై విరక్తితో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గొయి లో చోటు చేసుకున్నట్లు ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పాటిల్ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం ఎల్గొయి లావణ్య భర్త వెంకట్ అనే మహిళ తన కూతురు అనారోగ్యం పాలై న్యూమోనియా వ్యాధికి హైదరాబాద్ నగరంలోని నీలోఫర్ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 22న మృతి చెందడంతో స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. తన సొంత కూతురు చనిపోయిందన్న బాధతో మానసికంగా కృంగిపోయి జీవితం పై విరక్తితో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన బాధితురాలి భర్త బోయిని వెంకట్ తండ్రి విట్టల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవా పంచనమనిమిత్తం జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై క్రాంతికుమార్ పటేల్ తెలిపారు.
