
ఆర్డీఓని కలిసిన జిల్లా రైతు సంఘం అధ్యక్షులు.
ఆర్డీఓని కలిసిన జిల్లా రైతు సంఘం అధ్యక్షులు. జహీరాబాద్ నేటి ధాత్రి: జహీరాబాద్ ఆర్డీవో రామ్ రెడ్డిని రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చిట్టెంపల్లి బాలరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. రైతుకు భూ భారతి చట్టంపై అవగాహన, ఉండేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రైతు సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ.. రైతు సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నేతలు, తదితరులు పాల్గొన్నారు.