యువ నాయకులు ముర్తుజ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-19T125529.505.wav?_=1

 

యువ నాయకులు ముర్తుజ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

యువ నాయకులు ముర్తుజ గారి జన్మదినం సందర్బంగా,శాలువాతో సన్మానించి, కేక్ కట్ చేసి స్వీట్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన, బిఆర్ఎస్ నాయకులు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.జహీరాబాద్ పరిధిలో ముర్తుజ సేవలు మరువలేనివని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే మహా నాయకుడని కీర్తించారు. ప్రజల మధ్య ఉంటూ ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ నేనున్నానంటూ ధైర్యం ఇచ్చే ఏకైక నాయకుడు ముర్తుజ అని కొనియాడారు. నిరంతరం జహీరాబాద్ పట్టణంలో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. వారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని, మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, మరింతగా ప్రజలకు సేవ చేసే భాగ్యం వారికి కల్పించాలని, రాబోవు రోజుల్లో రాజకీయంగా అనేకమైన ఉన్నతమైన పదవులు పొందాలని వారు ఆకాంక్షించారు.

 

 

ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం కొహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మాజి కౌన్సిలర్ అబ్దుల్లా మాజి కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్ నాయకులు చిన్న రెడ్డి,దీపక్ అలి,సలీం అర్షద్,ఆసిఫ్ తదితరులు,

తొర్రూరులో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు అనుమల ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు

తొర్రూరులో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు అనుమల ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా – అన్నదానంతో మరింత విశిష్టత

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి అనుమల ఝాన్సీ రెడ్డి గారి జన్మదిన వేడుకలు సోమవారం తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్‌లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హాజరైనారు ఈ వేడుకలను పెదగాని సోమన్న గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు శ్రద్ధగా నిర్వహించారు.

వేడుకలు కేక్ కటింగ్‌తో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరైన నాయకులు, కార్యకర్తలు ఝాన్సీ రెడ్డి గారికి పుష్పగుచ్ఛాలు అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆహ్లాదకర వాతావరణంలో పార్టీ జెండాలతో, నినాదాలతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

అన్నదానం కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణ

జన్మదిన వేడుకల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక పేదలు, నిరుపేదలు, వృద్ధులు, కార్మికులు సహా వందలాది మంది ప్రజలకు భోజనాన్ని వడ్డించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పేదలతో భోజనం పంచుకోవడం ద్వారా ఝాన్సీ రెడ్డి గారి ప్రజాసేవా పంథా స్పష్టంగా ప్రతిబింబించిందని నాయకులు పేర్కొన్నారు

 

ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు పెద్దగాని సోమన్న మాట్లాడుతూ, “ఝాన్సీ రెడ్డి గారు కేవలం రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు, సేవా దృక్పథం కలిగిన నిజమైన ప్రజానేత. ఆమె ఎక్కడైనా ప్రజల సమస్యలతో మమేకమై, పరిష్కారానికి కృషి చేస్తారు. పార్టీని బలోపేతం చేస్తూ, సామాజిక న్యాయం సాధన కోసం పోరాడుతున్నారు” అని అన్నారు.

మరికొందరు మాట్లాడుతూ, “ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వంలో పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఎదుగుతోంది. ఆమెకు రాష్ట్ర స్థాయిలోనూ మరిన్ని కీలక బాధ్యతలు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అని అభిప్రాయపడ్డారు.

ఈ వేడుకలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ ఒకే కుటుంబ వాతావరణంలో కలిసి జరుపుకోవడం ఈ వేడుకను మరింత విశిష్టంగా మార్చింది.

సామాజిక స్పృహకు అద్దం
కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ, “జన్మదినాన్ని కేవలం ఆచారంగా కాకుండా, సామాజిక సేవతో అనుసంధానం చేయడం గొప్ప విషయమని. పేదలకు అన్నదానం చేయడం ద్వారా ఝాన్సీ రెడ్డి గారు నిజమైన ప్రజాసేవకురాలిగా నిలుస్తున్నారు” అని అన్నారు.
తొర్రూరు పట్టణంలో జరిగిన ఈ జన్మదిన వేడుకలు కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, ప్రజాసేవా పంథా, పార్టీ బలోపేతం, ప్రజలతో మమేకం అనే మూడు కోణాలను ప్రతిబింబించాయి. కార్యక్రమం పెద్దగాని సోమన్న కళావతి చాపల బాపీ రెడ్డి సోమ రాజశేఖర్ అమ్యా నాయక్ చిత్తలూరు శ్రీను గుండాల నరసయ్య బుసాని రాము అశోక్ రెడ్డి సోమేశ్వరరావు మేకల కుమార్ మంగళపల్లి రామచంద్రయ్య అంతా ఉత్సాహంగా సాగి, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో వేడుకకు ప్రత్యేకమైన గౌరవం దక్కింది.

తొర్రూరులో ఝాన్సి రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-31-6.wav?_=2

తొర్రూరులో ఘనంగా జరిగిన ఝాన్సి రాజేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు – హాజరైన ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు..

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి

టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని తొర్రూరు పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా ప్రారంభించారు.

పార్టీ కార్యాలయం శుభాకాంక్షల బ్యానర్లు, పూలదండలతో కళకళలాడింది. పట్టణ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై, పూలమాలలు వేసి, ఝాన్సి రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకలకు మరింత ఉత్సాహాన్ని తెచ్చారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ.. ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు ప్రజల కోసం ఎల్లప్పుడూ అహర్నిశలు కృషి చేస్తున్నారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె చూపుతున్న పట్టుదల అందరికీ ఆదర్శం. ఇలాంటి నాయకురాలు కాంగ్రెస్ పార్టీకి ఉండటం గర్వకారణం అని పేర్కొన్నారు..

అలాగే టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ప్రజలు, కార్యకర్తలు చూపిస్తున్న ప్రేమాభిమానాలు నన్ను మరింత కర్తవ్యబద్ధురాలిని చేస్తున్నాయి. ఈ ఆశీస్సులు, శ్రద్ధే నాకు బలమై, ప్రజాసేవలో మరింత కృషి చేయడానికి ప్రేరణనిస్తాయి” అని తెలిపారు..

కార్యక్రమం అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకొని, అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహించారు.

ఈ వేడుకల్లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సోమ రాజశేఖర్ బ్లాక్ అధ్యక్షులు ఆమ్య నాయక్ , మండల నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని జన్మదినోత్సవాన్ని విజయవంతం చేశారు..

ఉత్తమ అవార్డు అందుకున్న ఎమ్మార్వో ,ఎంపీడీవో.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-39-3.wav?_=3

ఉత్తమ అవార్డు అందుకున్న ఎమ్మార్వో ,ఎంపీడీవో

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో గా విధులు నిర్వహిస్తున్న మధురకవి సత్యనారాయణ స్వామికి ఉత్తమ ఎమ్మార్వో అవార్డు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ,ఎస్పీ కిరణ్ కారే,జడ్పీ సీఈవో విజయలక్ష్మి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గణపురం ఎమ్మార్వో గా విధులు నిర్వహిస్తున్న మధురకవి సత్యనారాయణ స్వామి ఉత్తమ అవార్డు అందుకున్నారు.

Best EMRO and MPDO Awards in Ganapuram

అదేవిధంగా గణపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న ఎల్ భాస్కర్ ఉత్తమ ఎంపీడీవో అవార్డును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ కారే జెడ్పిసిఓ విజయలక్ష్మి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గణపురంలోవిధులు నిర్వహిస్తున్న ఎమ్మార్వో, ఎంపీడీవోలు ఉత్తమ అవార్డు అందుకున్నారు.

ఓదెల మండలం లో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-49-1.wav?_=4

ఓదెల మండలం లో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో 79వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో పెద్దవల్లి సివిల్ జడ్జి ఎన్ మంజుల జాతీయ జెండాన ఎగురవేశారు. తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ ధీరజ్ కుమార్ జాతీయ పతాకాన్ని
ఎగరవేశారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జి తిరుపతి ఎస్సారెస్పీ కార్యాలయం లో డిఈ బి భాస్కర్, పొత్కపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై దీకొండ రమేష్, ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో ఈవో బి సదయ్య, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రధాన వైద్యాధికారి డాక్టర్ సహబజ్ ఖాన్, మండల వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఏవో బి భాస్కర్, మండల విద్యా అధికారి కార్యాలయంలో ఎంఈఓ వై రమేష్ ఐకెపి కార్యాలయంలో ఏపీఎం సంపత్
ప్రెస్ క్లబ్ ఆవరణంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పని
సుదర్శన్, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, ఓదెల పశువుల ఆసుపత్రి
ఆవరణలో పశు వైద్యాధికారి మల్లేశం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో కాలేజీ ప్రిన్సిపాల్, మోడల్స్కూల్ పాఠశాలలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, బీసీ హాస్టల్ ఆవరణలో హాస్టల్ వార్డెన్ ప్రవీణ్, కస్తూర్భా గాంధీ పాఠశాల ఆవరణలో ఎస్ఓ జ్యోతి తో పాటు వివిధ ప్రభుత్వ పాఠశాలలో
పాఠశాల
ప్రధానోపాధ్యాయులు ప్రైవేట పాఠశాలలో అలాగే వివిధ గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శులు, వివిధ పార్టీల, వివిధ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాలు ఎగరవేసారు. ఈ సందర్భంగా విద్యార్థు లకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పంద్రా గస్టు నాడు మనకు స్వతంత్రం వచ్చిన రోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటున్నా మంటే పూర్వం 1947కు పూర్వం ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమే నేడు మనం ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామన్నారు. రాను న్న రోజులలో ప్రపంచ దేశంలో మన భారత దేశాన్ని మరింత ముందుకు తీసుకో వెళ్ళవలసిన బాధ్యత బావి భారత పౌరులమైన మన అందరి పైన ఉందని అలాగే ఉద్యోగంలో పనిచేసేవారు మరింత చురుకుగా బాధ్యతగా పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండి మరింత సేవలు అందించా లని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ షబ్బీర్ పాష, అడ్వకేట్స్, ఏఎస్ఐ లు, సిఓ అంజి రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, సింగి ల్విండో డైరెక్టర్లు, పోలీస్ సిబ్బంది, వివిధ ప్రభుత్వ కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ ఉద్యోగి అవార్డులు అందుకున్న మండల అధికారులు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T154511.268-1.wav?_=5

 

ఉత్తమ ఉద్యోగి అవార్డులు అందుకున్న మండల అధికారులు

మహాదేవపూర్ ఆగస్టు 16 (నేటి ధాత్రి)

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండలంలోనీ పలువురు అధికారులు ఉత్తమ ఉద్యోగి అవార్డులు 79 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుక్రవారం రోజున జిల్లా పరిపాలన అధికారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. మండలంలోని డివిజనల్ పంచాయతీ అధికారి వీరభద్రయ్య, మండల పంచాయతీ అధికారి ప్రసాద్ మరియు మహాదేవపూర్ గ్రామపంచాయతీ అధికారి కల్పన లు 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో ఉత్తమ ఉద్యోగి అవార్డులను తీసుకోవడం జరిగింది. అనంతరం పంచాయతీ కార్యదర్శి కల్పన మాట్లాడుతూ ఉత్తమ ఉద్యోగి అవార్డు 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో తీసుకోవడం సంతోషంగా ఉందని ప్రజలకు చేసిన సేవలు జిల్లా అధికారులు గుర్తించి అవార్డును ఇచ్చినందుకు అభినందనలు తెలియజేయడం జరిగింది.

ఉత్తమ ఎంపీడీవో గా గుర్రం సత్యనారాయణ గౌడ్..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-17-4.wav?_=6

ఉత్తమ ఎంపీడీవో గా గుర్రం సత్యనారాయణ గౌడ్

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఎంపీడీవో గా బాధ్యతలు నిర్వహిస్తున్న గుర్రం సత్యనారాయణ గౌడ్ 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఎంపీడీవో గా ఎంపికై ప్రశంస పత్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా అందుకున్నారు.నిస్వార్ధంగా,నిబద్ధతతో,నియమనిష్ఠలతో తన కర్తవ్యాన్ని పరిపూర్ణంగా నిర్వర్తిస్తున్న ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ కి ఉత్తమ ఎంపీడీవో పురస్కారం లభించడం ఆనందదాయకమనీ తోటి అధికారులు హర్షం వ్యక్తం చేశారు.ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు తీరుస్తూ తోటి ఉద్యోగులతో కలిసి సమన్వయంతో పని చేస్తున్నటువంటి సత్యనారాయణ గౌడ్ కి మరెన్నో మంచి ఉన్నత స్థానాన్ని లభించాలని ఆకాంక్షించారు.

వియత్నం దేశంలో ఎస్ బి ఐ అంతర్జాతీయ సదస్సుకు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-14T140842.695-1.wav?_=7

 

వియత్నం దేశంలో ఎస్ బి ఐ అంతర్జాతీయ సదస్సుకు

వనపర్తి చిగుర్లపల్లి రవి ఎంపీక

వనపర్తి నేటిదాత్రి .

 

ఈ నేల 13 నుంచి 18వ తేదీ వరకు వియత్నం దేశంలో అంతర్జాతీయ ఎస్ బి ఐ లైఫ్ ఇన్సూరెన్స్ సదస్సుకు గాయత్రీ జిరాక్స్ యజమాని చిగుళ్ల పల్లి రవి ఎంపిక అయ్యారని డి ఆర్ ఎం విజయ్ చౌదరి డి ఎస్ ఏం దిలీప్ రెడ్డి బ్రాంచ్ మేనేజర్ కిష్టయ్య సీనియర్ బిజినెస్ మేనేజర్ వెంకట్ రావులు తెలిపారు రవి అందించిన సేవలకు గుర్తింపు ఇన్సూరెన్స్ పై ప్రజలకు అవగాహన కల్పించడం కలిగే లాభాలను ప్రజలకు తెలిపి నందుకు.వియత్నం దేశంలోలో జరిగే అంతర్జాతీయ ఇన్సూరెన్స్ సదస్సులో ఉత్తమ ఇన్సూరెన్స్ ఏజెంట్ డైమండ్ అవార్డు అందుకోబోతున్నందున వారు రవిని అభినందించారు ఈమేరకు అవార్డుకు ఎంపి క కావడంతో రవి సంతోషం వ్యక్తం చేశారు

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆచార్య ప్రొ.కొత్తపల్లి .

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-18.wav?_=8


జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆచార్య ప్రొ.కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను యావత్ ప్రపంచానికి చాటి చెప్పి ప్రత్యేక రాష్ట్ర సాధనకు జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ అని అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్ర పటానికి అధికారులు,పోలీస్ సిబ్బందితో కలసి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ..సిద్ధాంతకర్తగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం తన జీవిత కాలం రాష్ట్ర సాధనకే త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటిచెప్పి ఉద్యమ స్ఫూర్తితో ప్రజలను చైతన్యం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. ఆయన జీవితం నేటి యువ‌త‌కు ఆద‌ర్శప్రాయం,స్ఫూర్తిదాయకమన్నారు.
ఆయన స్పూర్తితో ప్రజలకు పోలీస్ శాఖ ద్వారా మరింత మెరుగైన సేవలందించి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐలురమేష్ ,యాదగిరి,కార్యాలయ
సూపరింటెండెంట్ లు,జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి.

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:*

Dr. Satya Sarada.

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ త్వరగా పరిష్కరించాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి , జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, డిఆర్డిఓ కౌసల్యాదేవి,ఆర్డీవోలు వరంగల్ సత్యపాల్ రెడ్డి, నర్సంపేట ఉమారాణి ,హౌసింగ్ పీడీ గణపతి పాల్గొని ప్రజలనుండి దరఖాస్తులు స్వీకరించారు.ఈ ప్రజావాణిలో మొత్తం 150 దరఖాస్తులు రాగా ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించినవి 58, పిడి హౌసింగ్ 25, జి డబ్ల్యూ ఎం సి 13 దరఖాస్తులు రాగా, మిగతా శాఖలకు సంబందించిన దరఖాస్తులు 54 స్వీకరించామని కలెక్టర్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో స్వీకరీంచిన దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ,డిసిఓ నీరజ, డిబిసిడివో పుష్పలత, కలెక్టరేట్ పరిపాలన అధికారి విశ్వప్రసాద్ వరంగల్, ఖిలా వరంగల్ తహసిల్దార్లు ఇక్బాల్,నాగేశ్వర్ రావు, సంబంధిత శాఖల అధికారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రజాసేవయే నా జీవిత ఆశయం…

ప్రజాసేవయే నా జీవిత ఆశయం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుల నక్క రవిపై.ప్రత్యేక కథనం. ఈ సందర్భంగా వారి మాటల్లోనే తాను చిన్నతనంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఒక ప్రముఖ వైద్యులు దగ్గర వైద్యం నేర్చుకొని ఎలాగైనా పల్లెటూరు ప్రజలకు వైద్య సేవలు అందించాలని నిశ్చయంతో ఊరిలో ప్రాక్టీసు ప్రారంభించానని తద్వారా ఏ రాత్రి అయిన గ్రామ ప్రజలకు గాని చుట్టుపక్కల ప్రజలకు గాని అత్యవసరమైన సమయంలో వైద్య సేవలు అందించడం నా పూర్వజన్మ సుకృత ముగ భావిస్తునని ఇలా ప్రజలకు ప్రథమ చికిత్స చేసి అత్యవసర సమయంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రక్రియ చేసి మెరుగైన వైద్యం కొరకు ప్రజలకు ముందుగాసేవ చేసే అదృష్టం ఆ దేవుడు నాకు కల్పించడానికి అదృష్టంగా భావిస్తున్నాను తెలియజేస్తూ అలాగే నాపై ఉన్న అభిమానంతో నేను గ్రామీణ ప్రజలకుచేస్తున్న సేవలను గుర్తించి ప్రజలు నాపై నమ్మకంతో రాజకీయాలకు రావాలని ఆహ్వానించడం మాజీ మంత్రి కేటీ రామారావు ప్రత్యేక ఆహ్వానంతో రాజకీయాలకు వచ్చి ప్రజలకు ప్రతి సమయంలో ఏ సమస్య వచ్చినా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి రాజకీయ నాయకులతో సంప్రదింపులు జరిపి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని ఇటువంటి అదృష్టం ఈ జన్మ కి.దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను తెలియజేస్తూ ఇట్టి మంచి అవకాశాన్ని దేవుడు నాకు ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని ప్రతి ప్రాదించడాన్ని నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఇంతకంటే అదృష్టం దేవుడు ఇవ్వడం అలాగే గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇకముందు కూడా ప్రజలకు రాజకీయం గాని వైద్య వృత్తిలో గాని ప్రజలందరికీ అందుబాటులో ఉంటారని వారికి ఎల్లవేళలా వైద్యపరంగా రాజకీయపరంగా కృషి చేస్తాననిఈ సందర్భంగా తెలియజేశారు దయచేసి ఏమైనా పొరపాట్లు ఉన్నచో గ్రామ ప్రజలు రాజకీయ నాయకులు దయచేసి పెద్ద మనసుతో మన్నించాలని ఈ సందర్భంగా తెలియజేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version