ఘనంగా శ్రీపాదరావు వర్ధంతి వేడుకలు కోట రాజబాబు గౌడ్ గ్రంధాలయ సంస్థ చైర్మన్..

ఘనంగా శ్రీపాదరావు వర్ధంతి వేడుకలు కోట రాజబాబు గౌడ్ గ్రంధాలయ సంస్థ చైర్మన్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతిని గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు గౌడ్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు అనంతరం మాట్లాడుతూ
శ్రీపాదరావు ధన్వాడ గ్రామ సర్పంచ్‌గా మూడుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికై, గ్రామానికి ఉత్తమ పంచాయతి అవార్డులు తెచ్చారు. మహాదేవ్పూర్ సమితి అధ్యక్షుడు, భూతనఖా బ్యాంకు చైర్మెన్‌గా పనిచేసి ప్రజలకు సేవలందించారు.మంథని ప్రాంతంలో అభివృద్ధికి, ప్రజాసేవకు జీవితాంతం కట్టుబడి ఉండి, నక్సల్స్ చేతిలో ప్రాణాలు వదిలాడు
కాంగ్రెస్‌లో పార్టీ గుర్తింపు
1983, 1985, 1989లో మంథని నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌తో మూడుసార్లు గెలిచి శాసనసభ్యుడయ్యారు. 1984లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్‌గా, 1989-1994 మధ్య శాసనసభ స్పీకర్‌గా నిష్పాక్షికంగా పనిచేసి అన్ని పార్టీల మన్ననలు పొందారు స్వపక్షం, ప్రతిపక్షాలకు సమాన అవకాశాలు కల్పించి స్పీకర్ పదవికి వన్నె తెచ్చారు వారు అన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version