అంబేద్కర్ నేషనల్ అవార్డు మంగళపల్లి శ్రీనివాస్‌కు..

భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్
మొగుళ్ళపల్లి నేటి దాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన మంగళపల్లి శ్రీనివాస్ గత 30 సంవత్సరాల నుండి అంబేద్కర్ యువజన సంఘం లో అలాగే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు సమాచార హక్కు చట్టం ప్రచార సమితి, ఉచిత న్యాయ సేవ అధికారి సంస్థ ఆధ్వర్యంలో ( PLV) పారా లీగల్ వాలంటీర్ గా ఎన్నో స్వచ్ఛంద సంస్థ కార్యక్రమంలో పాల్గొని సేవా కార్యక్రమాలు చేపట్టినందుకుగాను దక్కిన గొప్ప గౌరవం
స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ఎన్జీవోస్ వారు బుధవారం నాడు హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ సంఘాలలో మరియు సంస్థలలోస్వచ్ఛందంగా సేవ కార్యక్రమాలు నిర్వహించిన వారికి స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో బుధవారం నాడు సిటీ సెంటర్ కల్చలేర్ ఆడిటోరియం ముషీరాబాద్ హైదరాబాదులో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఎంపికైన వారందరికీ ముఖ్య అతిథుల చేతుల మీదుగా నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ నేషనల్ అవార్డు అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ అవార్డును అందుకోవడం జరిగింది.
ఈ అవార్డుల కార్యక్రమంలో స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ఎన్జీవోస్ చైర్మన్ లయన్ డాక్టర్ ఆకుల రమేష్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ టీవీ రామకృష్ణ ఫిలిం రెడ్డి గారు మల్ల రమేష్ వ్యవస్థాపక సభ్యులు, డాక్టర్ గూడూరు చెన్నారెడ్డి, శంషాబాద్ ఎంఈఓ డాక్టర్ ఇస్లావత్కాసన నాయక్ ల చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు అవార్డు గ్రహీత మంగళపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ నాకు ఈ అవార్డు బహుకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే ఈ అవార్డు తీసుకోవడం వల్ల నాకు మరింత బాధ్యత పెరిగిందని రానున్న రోజుల్లో బాధ్యతగా పనిచేసే ఇంక సేవా కార్యక్రమాలు చేపడతానన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version