చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీడిగ్రీ పీజీ ఫస్ట్ సెమిస్టరు ఫలితాలు విడుదల

చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీడిగ్రీ పీజీ ఫస్ట్ సెమిస్టరు ఫలితాలు విడుదల

* హిమాయత్ నగర్ చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ డిగ్రీ, బి .టెక్ , బి .ఫార్మసీ ,నర్సింగ్ , అగ్రికల్చర్, పీజీ 1 వ సెమిస్టర్ (ఎం . యస్సి , ఎం .టెక్ , ఎంబీఏ , ఎంసిఏ, ఎం .ఫార్మసీ) ఫలితాల విడుదలయ్యాయి.

నేటిధాత్రి,రంగారెడ్డి:

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్‌లో గల చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ లో జనవరి – ఫిబ్రవరి లో నిర్వహించిన డిగ్రీ, పీజీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను యూనివర్సిటీ వ్యవస్థాపకులు ఛాన్సలర్ డాక్టర్ సిహెచ్. వి . పురుషోత్తం రెడ్డి అధికారికంగా విడుదల చేశారు.

•విభాగాల వారీగా డిగ్రీ ఉత్తీర్ణత వివరాలు..

కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్ ( బి.కామ్, బిబిఏ) 1 వ సెమిస్టరు లో 42 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కాగా 20 మంది విద్యార్థులు ఉత్తీర్ణయిలైనారు, 47.62%, ఫ్యాకల్టీ అఫ్ సైన్స్ (బి .యస్సీ, బిసిఏ) 1 వ సెమిస్టరు లో 180 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కాగా 99 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 55.00%, ఫ్యాకల్టీ అఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ ( బి.టెక్ ఆల్ గ్రూప్స్ ) 1 వ సెమిస్టరు లో 1424 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కాగా 913 మంది విద్యార్థులు ఉత్తీర్ణలైనారు, 64.12%, బి .ఫార్మసీ 1 వ సెమిస్టర్ లో 32 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కాగా 15 మంది విద్యార్థులు ఉత్తీర్ణయిలైనారు, 46.88%, అగ్రికల్చర్ 1 వ సెమిస్టర్ లో 82 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కాగా 71 మంది విద్యార్థులు ఉత్తీర్ణయిలైనారు, 86.59%. అలైడ్ హెల్త్ సైన్సెస్ ( ఏఓటి , ఆర్ఐటి, సివిటి) – 1 వ సెమిస్టర్ లో 158 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కాగా 110 మంది విద్యార్థులు ఉత్తీర్ణయిలైనారు, 69.62%, నర్సింగ్ 1 వ సెమిస్టర్ లో 69 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కాగా 46 మంది విద్యార్థులు ఉత్తీర్ణయిలైనారు, 66.67%,
పీజీ (ఎం . యస్సి , ఎం .టెక్ , ఎంబీఏ , ఎంసిఏ, ఎం .ఫార్మసీ) 1 వ సెమిస్టర్ లో 231 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కాగా 181 మంది విద్యార్థులు ఉత్తీర్ణయిలైనారు, 78.35%. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఛాన్సలర్ డా. పురుషోత్తం రెడ్డి, డైరెక్టర్ & చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్. సాత్విక రెడ్డి, విద్యార్థులు సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ వారిని అభినందించారు. అధ్యాపకుల కృషిని కూడా వారు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సెక్రటరీ -కం – కరస్పాండెంట్ సిహెచ్ . సువర్ణదేవి, వైస్ ఛాన్సలర్ ఆచార్య జి . శంకర్ లింగం , రిజిస్ట్రార్ ఎం. రవీందర్ , డీన్ అడ్మినిస్ట్రేషన్ ఏ. రాజు డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ ఎస్. కవిత , డీన్ అడ్మిషన్స్ సిహెచ్. ప్రత్యుష రెడ్డి , డీన్ కామర్స్ & బిజినెస్ మేనేజ్మెంట్ పి. సుగంధ దేవి , డీన్ ఫార్మసీ. జి. కుమారస్వామి , డీన్ అగ్రికల్చర్ దేవ్ కుమార్ , ఎగ్జామ్స్ కంట్రోలర్ బి. రాజేందర్ రెడ్డి తదితర అధికారులు, విభాగాధిపతులు, ఫ్యాకల్టీ సభ్యులు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ & పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గాదె రాంబాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు…

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు

ఎంపీసీ ద్వితీయ సంవత్స రం భానుశ్రీ 969 మార్కు లు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట ప్రభుత్వ జూని యర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ 2026 వార్షిక పరీక్ష లలో ఉత్తమ ప్రతిభ కనబరిచి కళాశాలకు మంచి పేరు తీసుకువచ్చారని, కళాశాల ప్రిన్సిపాల్ కందకట్ల కోటేష్ విద్యార్థులను అభినందించి, అధ్యాపక బృందం కృషిని

ప్రశంసించారు. ద్వితీ య సంవత్సరం ఎంపీసీ విభా గంలో ఎ. భాను శ్రీ 967

ప్రశంసించారు. ద్వితీ య సంవత్సరం ఎంపీసీ విభా గంలో ఎ. భాను శ్రీ 967

 

మా ర్కులతో కళాశాల టాపర్‌గా బి. వరుణ్ 965, కె. విజయ్ కుమార్ 964,

సి.హెచ్. వరుణ్ 903 మార్కు లు సాధించారు. బైపీసీ ద్వితీయ సంవత్సరంలో సి.హెచ్. నాగ శ్రీ 719

మార్కులు సాధించి ప్రథమ స్థానం పొందారు. సీఈ సీ ద్వితీయ సంవత్సరం లో కె. భరత్ 541

మార్కు లతో ప్రతిభ చాటారు.ప్రథమ సంవ త్సరం ఎంపీసీ విభాగంలో కె. జెస్సికా 463 మా ర్కులతో మొదటి స్థానం సాధించగా, పి. పూజిత 441, పి. తరుణ్ కుమార్ 440, సి.హెచ్. హారిక 401 మా ర్కులు సాధించా రు.బైపీసీ ప్రథమ సంవత్స రంలో ఎస్‌కె. సానియా కౌస్రా 398 మార్కులతో నిలిచారు. డి. అర్చన 336, డి. క్రిస్టినా 332, జి. లహరి 329 మార్కు లు సాధించారు.కళాశాల మొత్తం ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 65%, ప్రథమ సంవత్స రం ఉత్తీర్ణత శాతం 39% నమోదైంది.ఈ విజయా నికి కృషి చేసిన విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందిని ప్రిన్సిపాల్ అభినం దించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version