చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీడిగ్రీ పీజీ ఫస్ట్ సెమిస్టరు ఫలితాలు విడుదల
* హిమాయత్ నగర్ చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ డిగ్రీ, బి .టెక్ , బి .ఫార్మసీ ,నర్సింగ్ , అగ్రికల్చర్, పీజీ 1 వ సెమిస్టర్ (ఎం . యస్సి , ఎం .టెక్ , ఎంబీఏ , ఎంసిఏ, ఎం .ఫార్మసీ) ఫలితాల విడుదలయ్యాయి.
నేటిధాత్రి,రంగారెడ్డి:
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్‌లో గల చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ లో జనవరి – ఫిబ్రవరి లో నిర్వహించిన డిగ్రీ, పీజీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను యూనివర్సిటీ వ్యవస్థాపకులు ఛాన్సలర్ డాక్టర్ సిహెచ్. వి . పురుషోత్తం రెడ్డి అధికారికంగా విడుదల చేశారు.
•విభాగాల వారీగా డిగ్రీ ఉత్తీర్ణత వివరాలు..
కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్ ( బి.కామ్, బిబిఏ) 1 వ సెమిస్టరు లో 42 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కాగా 20 మంది విద్యార్థులు ఉత్తీర్ణయిలైనారు, 47.62%, ఫ్యాకల్టీ అఫ్ సైన్స్ (బి .యస్సీ, బిసిఏ) 1 వ సెమిస్టరు లో 180 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కాగా 99 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 55.00%, ఫ్యాకల్టీ అఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ ( బి.టెక్ ఆల్ గ్రూప్స్ ) 1 వ సెమిస్టరు లో 1424 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కాగా 913 మంది విద్యార్థులు ఉత్తీర్ణలైనారు, 64.12%, బి .ఫార్మసీ 1 వ సెమిస్టర్ లో 32 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కాగా 15 మంది విద్యార్థులు ఉత్తీర్ణయిలైనారు, 46.88%, అగ్రికల్చర్ 1 వ సెమిస్టర్ లో 82 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కాగా 71 మంది విద్యార్థులు ఉత్తీర్ణయిలైనారు, 86.59%. అలైడ్ హెల్త్ సైన్సెస్ ( ఏఓటి , ఆర్ఐటి, సివిటి) – 1 వ సెమిస్టర్ లో 158 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కాగా 110 మంది విద్యార్థులు ఉత్తీర్ణయిలైనారు, 69.62%, నర్సింగ్ 1 వ సెమిస్టర్ లో 69 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కాగా 46 మంది విద్యార్థులు ఉత్తీర్ణయిలైనారు, 66.67%,
పీజీ (ఎం . యస్సి , ఎం .టెక్ , ఎంబీఏ , ఎంసిఏ, ఎం .ఫార్మసీ) 1 వ సెమిస్టర్ లో 231 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కాగా 181 మంది విద్యార్థులు ఉత్తీర్ణయిలైనారు, 78.35%. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఛాన్సలర్ డా. పురుషోత్తం రెడ్డి, డైరెక్టర్ & చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్. సాత్విక రెడ్డి, విద్యార్థులు సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ వారిని అభినందించారు. అధ్యాపకుల కృషిని కూడా వారు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సెక్రటరీ -కం – కరస్పాండెంట్ సిహెచ్ . సువర్ణదేవి, వైస్ ఛాన్సలర్ ఆచార్య జి . శంకర్ లింగం , రిజిస్ట్రార్ ఎం. రవీందర్ , డీన్ అడ్మినిస్ట్రేషన్ ఏ. రాజు డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ ఎస్. కవిత , డీన్ అడ్మిషన్స్ సిహెచ్. ప్రత్యుష రెడ్డి , డీన్ కామర్స్ & బిజినెస్ మేనేజ్మెంట్ పి. సుగంధ దేవి , డీన్ ఫార్మసీ. జి. కుమారస్వామి , డీన్ అగ్రికల్చర్ దేవ్ కుమార్ , ఎగ్జామ్స్ కంట్రోలర్ బి. రాజేందర్ రెడ్డి తదితర అధికారులు, విభాగాధిపతులు, ఫ్యాకల్టీ సభ్యులు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ & పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గాదె రాంబాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
