రామకృష్ణాపూర్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు నేడు ముగింపు

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడుపు నేటితో ముగింపు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో క్యాతన్ పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపాలిటీ ఎన్నికల కు నేటితో నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో నామినేషన్లు వెయ్యడానికి అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. తొలిరోజు నామమాత్రంగా సాగిన ఈ ప్రక్రియ రెండో రోజుకు చేరుకునేసరికి ఒక్కసారిగా వేగం పుంజుకుంది. మూడవ రోజు అభ్యర్థులు నామినేషన్లు భారీగా వేశారు. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి లతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు, మందమర్రి సిఐ పి రమేష్ ,ఆర్కెపి ఎస్సై జే శ్రీధర్ లు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రం వద్దకు ఆర్డిఓ శ్రీనివాసులు వచ్చి పర్యవేక్షణ చేశారు. నామినేషన్ కేంద్రం వద్ద అభ్యర్థులకు ఎన్నికల సంఘం నిబంధన మేరకు అనుమతులు ఇచ్చారు.

స్థానిక సంస్థల..”ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల”..

స్థానిక సంస్థల..”ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల”..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

3వ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈ రోజు (బుధవారం) జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్ కల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి నోటిఫికేషన్ ను విడుదల చేశారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు ఆసక్తిగల అభ్యర్థులు ఈ రోజు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్థానిక ఐకెపి (ఇందిరా క్రాంతి పథకం) కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయవచ్చు. ఈ నెల 5 వరకు నామినేషన్ దాఖలు చేయడానికి చివరి అవకాశం..!

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version